ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త ఏడాదిలోని తొలి నెలలో ఉపవాసాలు, పండుగలు కూడా వచ్చేస్తున్నాయి. అయితే ఏ రోజు ఏ పండుగో ఇక్కడ పొందుపరచడం జరిగింది. మరి ఆ పండుగల ఎప్పుడో ఒక లుక్ వేసేయండి. అసలు జనవరి అంటేనే చాల మందికి ఇష్టమైన నెల. ఈ నెలలోనే పెద్ద పండుగ అయిన సంక్రాంతిని జరుపుకుంటాము. కోడి పందేలు, జల్లికట్టు ఉత్సవాలు, ముత్యాల ముగ్గులు, ఉత్సవాలు అబ్బా ఒకటేమిటి ఇలా ఎన్నో మనం సంక్రాంతికి జరుపుకుంటాము. ఈ సందర్భంగా ఈ నెలలో వచ్చే ప్రధానమైన ఉపవాసాలు, పండుగలు, ముఖ్యమైన తేదీల గురించి ఆలస్యం లేకుండా చూసేయండి మరి.
ముందు జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం జరుపుకోటం. తదుపరి జనవరి 2వ తేదీన సంకష్ట చతుర్థి ఉపవాసాన్ని హిందువులు. సంకష్ట చతుర్థి ఉపవాసం చేయడంతో పాటు వినాయకుడిని పూజిస్తారు. జనవరి 10 వచ్చేసి ప్రదోష్ వ్రతం. ఈ పర్వదినాన హిందువులు పరమేశ్వరుడిని ప్రార్థిస్తారు. ఇది ఇలా ఉండగా 11న మాస శివరాత్రి వచ్చింది. ఆ తరువాత వచ్చేది భోగి పండుగ. భోగిమంటలు వేయడం, భోగి పళ్ళు పోయడం, రంగురంగుల ముగ్గులను వేయడం ఇలా ఎంతో బాగా జరుపుకుంటారు.
ఇక జనవరి 14వ తేదీ సంక్రాంతిని చేసుకుంటాము. ఈ పండుగ వ్యవసాయంతో ముడి పడి ఉంటుంది. ఈ సమయంలో రైతుల పంట చేతికొచ్చి ఉంటుంది. ఎంతో వైభవంగా ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. జనవరి 16, 2021 వినాయక చతుర్థి. ఈరోజు వినాయక పూజలు చేస్తారు. 24 జనవరి న పుత్రదా ఏకాదశి చాలా మంది తమకు సంతానం కోసం, పిల్లల శ్రేయస్సు కోసం పుత్రదా ఏకాదశి రోజున ఉపవాసం పాటిస్తుంటారు. ఇక ప్రతి సంవత్సరం 26వ తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటారు.