ఆన్‌లైన్‌ లో ఆధార్-పాన్ లింక్ స్టేటస్‌ ని ఇలా చెక్ చేసుకోవచ్చు..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ లేదంటే ఎన్నో పనులు ఆగిపోతాయి. అయితే మన ఇండియా లో ట్యాక్స్ కట్టే వాళ్లందరికీ కూడా పాన్‌ ని ఆధార్‌ తో లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు ని ప్రభుత్వం జారీ చేసింది. ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి 2023 జూన్ 30 వరకు గడువును కూడా పెట్టింది.

ఈ తేదీ లోగా పాన్‌ను ఆధార్‌ తో లింక్ చేయాలి. ఒకవేళ కనుక లింక్ చేయకపోతే లింక్ చేయండి. లేదంటే ఆదాయ పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడానికి పాన్‌ ఉపయోగించలేరు. అలానే మీరు కనుక లింక్ చేయక పొతే బ్యాంకు అకౌంట్‌లు ఓపెన్‌ అవదు. సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వంటివి కూడా అవ్వవు. ఆధార్, పాన్ లింక్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో ఇప్పుడే చూసేద్దాం..

ఆదాయ పన్ను శాఖ అధికారిక ఇ-ఫైలింగ్ పోర్టల్‌ www.incometax.gov.in/iec/foportal/ ని మీరు ముందు ఓపెన్‌ చేయాలి.
ఆ తరవాత హోమ్‌పేజీలో ‘క్విక్‌ లింక్స్‌’ సెక్షన్‌ లో ‘లింక్ ఆధార్ స్టేటస్’ మీద నొక్కండి.
సంబంధిత ఫీల్డ్‌ల లో పాన్, ఆధార్ నంబర్‌ను ఎంటర్‌ చేసి, ‘వ్యూ లింక్ ఆధార్ స్టేటస్‌’ అనే ఆప్షన్‌ సెలక్ట్‌ చేయాలి. ఆ తరవాత సక్సెస్‌ఫుల్‌ వ్యాలిడేషన్‌ తర్వాత మీరు లింక్ ఆధార్ స్టేటస్‌ ని చూపిస్తూ మీకు ఒక మెసేజ్‌ డిస్‌ప్లే అవుతుంది.
ఒకవేళ కనుక లింకింగ్ ప్రాసెస్ ఇంకా ప్రోగ్రెస్‌లో ఉంటే… ఆధార్-పాన్ లింకింగ్ రిక్వెస్ట్‌ వ్యాలిడేషన్‌ కోసం UIDAIకి ఇచ్చినట్టు కనిపిస్తుంది.
ఒకవేళ అయ్యి ఉంటే సక్సెస్ అయినట్లు మెసేజ్‌ డిస్‌ప్లే వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news