విశాఖపట్నం నుంచి టూర్.. వావ్ ఊటీ, మైసూర్, కూర్గ్ ఇవన్నీ చుట్టేసి వచ్చేయచ్చు..!

-

మంచి టూర్ వేసేయాలి అని అనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. విశాఖపట్నం నుంచి టూర్ వేసేయాలి అనుకుంటే ఈ టూర్ ప్లాన్ బాగుంటుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం స్పెషల్ గా ఒక ప్యాకేజీ ని అందిస్తోంది. ఊటీ, మైసూర్, కూర్గ్, బెంగళూరులోని పర్యాటక ప్రాంతాలను ఈ ప్యాకేజీ లో కవర్ అయిపోతాయి. టూర్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ వ్యాలీస్ పేరు తో ఈ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ని అందిస్తున్నారు. పర్యాటకుల్ని ఫ్లైట్‌లో తీసుకెళ్లి పశ్చిమ కనుమల్లోని పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు. ఇక ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు చూస్తే.. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

ఆగస్ట్ 10న ఈ టూర్ విశాఖపట్నం లో స్టార్ట్ కానుంది. పర్యాటకులు ఉదయం 7.40 గంటలకు విశాఖపట్నంలో స్టార్ట్ అయితే 9.15 గంటలకు బెంగళూరు రీచ్ అవుతారు. అక్కడ నుండి ఊటీకి బయల్దేరాలి. ఊటీ చేరుకున్న తర్వాత రిలాక్స్ అవ్వచ్చు. సాయంత్రం ఖాళీ సమయంలో షాపింగ్ చేయొచ్చు. రాత్రికి ఊటీలో ఉండాలి. రెండో రోజు ఊటీ ఫుల్ డే సైట్‌సీయింగ్. దొడ్డబెట్ట, బొటానికల్ గార్డెన్స్, రోజ్ గార్డెన్, ఊటీ లేక్ ఇవన్నీ చూడచ్చు. టీ ఫ్యాక్టరీ చూడచ్చు. మూడో రోజు ఊకూర్గ్ టూర్ ఉంటుంది. బైలుకుప్పె టిబెటియన్ సెటిల్మెంట్, ఎలిఫ్యాంట్ క్యాంప్ చూడచ్చు.

నాలుగో రోజు సైట్ సీయింగ్ తలకావేరీ ఆలయం, భగమండల, భగందీశ్వర ఆలయాన్ని చూడచ్చు. లంచ్ తర్వాత అబ్బే ఫాల్స్, ఓంకారేశ్వర ఆలయం, రాజా సీట్ చూడచ్చు. ఐదో రోజు మైసూర్ బయల్దేరాలి. మైసూర్ ప్యాలెస్, మైసూజ్ జూ, చాముండీ హిల్స్, చాముండేశ్వరి ఆలయం, బృందావన్ గార్డెన్స్ ఇవన్నీ చూడవచ్చు. రాత్రికి మైసూరులో ఉండాలి. ఆరో రోజు బెంగళూరు లాల్‌బాగ్, విశ్వేశ్వరయ్య మ్యూజియం చూసి సాయంత్రం 4 గంటలకు బెంగళూరు విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 6.30 గంటలకు విశాఖపట్నం వచ్చేయచ్చు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.25,875, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.26,650, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.35,210 పే చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news