పిల్లల పేరు మీద ఇన్వస్ట్‌ చేస్తున్నారా.. ఈ విషయాలు ముందు తెలుసుకోండి..!

-

జాబ్‌ చేస్తున్నామంటే.. మన అవసరాలను తీర్చుకుంటే సరిపోదు.. ఫ్యూచర్‌ ప్లానింగ్స్‌ ఉండాలి. నాకు ఇంకా పెళ్లే కాలేదు కదా.. అప్పుడే ఏం సేవ్ చేస్తాంలే అని వచ్చిందంతా ఖర్చు పెట్టేస్తే ఆ తర్వాత అన్ని సంవత్సరాల నుంచి జాబ్‌ చేస్తున్నా రూపాయి లేదని మీరే బాధపడతారు. రాబోయే పిల్లల కోసం ఇప్పటి నుంచి సేవ్‌ చేయడం తెలివైన వారి లక్షణం. సరే పిల్లలు పుట్టిన తర్వాత అయిన సేవింగ్స్‌ చేయడం మొదలు పట్టాలి. పిల్లల పేరు మీద పెట్టుబడి పెడితే ఎలాంటి లాభాలు పొందవచ్చు, ఇందులో ఎదురయ్యే రిస్క్‌ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం.

How Parents Can Teach Their Children About Investing -

తల్లిదండ్రులు పిల్లల బ్యాంక్‌ అకౌంట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టాలనుకుంటే తప్ప వారి పేరు మీద బ్యాంకు అకౌంట్ ఓపెన్‌ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే అకౌంట్‌ వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. మైనర్‌కు ఇండివిడ్యువల్ బ్యాంక్‌ అకౌంట్‌ ఉండకూడదు కాబట్టి, తప్పనిసరిగా తల్లిదండ్రులలో ఒకరు జాయింట్‌గా మెయింటైన్‌ చేయాలి. ఫైనాన్షియల్‌ ప్లాన్‌లు ఈజీగా మార్చకుండా, విత్‌డ్రా చేసుకోకుండా ఈ ఏర్పాటు సహాయపడుతుంది. 18 ఏళ్లు నిండిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌ని రీడీమ్ చేస్తే, పిల్లల పేరు మీద క్యాపిటల్‌ గెయిన్స్‌పై ట్యాక్స్‌ విధిస్తారు. తల్లిదండ్రుల దీర్ఘకాలిక పన్ను భారాలను తగ్గించుకోవచ్చు.

10 Best Piggy Bank Tips for Kids

పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలలో బంధువులు ఇచ్చే గిఫ్ట్‌లను మేనేజ్‌ చేయడానికి తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లతో బ్యాంకు అకౌంట్‌లు ఓపెన్‌ చేస్తుంటారు. బంధువులు పిల్లల పేరు మీద పెట్టుబడులు పెట్టడానికి ఇది ట్యాక్స్‌- ఎఫిషియంట్‌ మార్గం. సంవత్సరంలో బంధువుల అందించే రూ.50 వేల గిఫ్ట్‌ల వరకు ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?:

చాలా మంది ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన (SSY)లో పెట్టుబడి పెడుతుంటారు. దీర్ఘకాలం లాక్-ఇన్ పీరియడ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇతర ప్రధాన పెట్టుబడులు ఈక్విటీ-లింక్డ్ అయితే మరింత ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఇన్సూరెన్స్‌, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలు అందిస్తున్న చైల్డ్‌-స్పెసిఫిక్‌ ప్లాన్‌లు కూడా మంచి ఆప్షన్‌ అవుతాయి.

ULIP మంచిదేనా..?

కొంతమంది తల్లిదండ్రులు మార్కెట్-లింక్డ్ రాబడి కోసం యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను (ULIP) ఎంచుకుంటారు, మరికొందరు మరింత కన్వీనియన్స్‌ కోసం జనరల్‌ టర్మ్ ప్లాన్, డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్‌ కలయికను ఇష్టపడతారు. పిల్లల పేరు మీద ఉన్న డీమ్యాట్ అకౌంట్‌ ద్వారా డైరెక్ట్ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడం కూడా సాధ్యమే, అయితే కొన్ని పరిమితులు వర్తిస్తాయి. సెకండరీ మార్కెట్ నుంచి స్టాక్ కొనుగోళ్ల కోసం అకౌంట్‌ను ఉపయోగించడానికి తల్లిదండ్రులకు అనుమతి ఉండదు.

తల్లిదండ్రులు తమ బిడ్డకు 18 ఏళ్లు నిండిన తర్వాత వారి పేరు మీద ఉన్న అన్ని పెట్టుబడులకు యజమాని అవుతారని గుర్తుంచుకోవాలి. గణనీయమైన మొత్తంలో డబ్బును మేనేజ్‌ చేయడానికి పిల్లవాడు ఆర్థికంగా బాధ్యత వహిస్తాడా లేదా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. అంతే కాకుండా పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రుల పదవీ విరమణ రెండింటికీ పెట్టుబడులను బ్యాలెన్స్ చేయడం సవాలుగా ఉండవచ్చు. రిటైర్‌మెంట్‌ను సెక్యూర్‌ చేసుకోవడం ప్రధానమనిపిస్తే, రిటైర్‌మెంట్ సేవింగ్స్‌కి హాని కలిగించే బదులు పిల్లల ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం గురించి ఆలోచించండి.

Read more RELATED
Recommended to you

Latest news