రోజుకు రూ.160 ఆదా చేసి రూ.23 లక్షలు పొందండి..!

మీరు ఏమైనా మంచి స్కీమ్ లో డబ్బులని ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం దేశీ దిగ్గజ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC ఆఫ్ ఇండియా అదిరిపోయే పాలసీని ఒకటి తీసుకు రావడం జరిగింది. దీని వలన ఎన్నో రకాల బెనిఫిట్స్ మీకు కలుగుతాయి. ఇక పాలసీ వలన కలిగే బెనిఫిట్స్, ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి అనేవి చూద్దాం. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ పాలసీ పేరు ఎల్‌ఐసీ న్యూ మనీ బ్యాక్ పాలసీ. ఈ పాలసీ తీసుకుంటే కచ్చితమైన రాబడి పొందొచ్చు. బోనస్ వంటివి కూడా వస్తాయి. పైగా దీని వలన మీరు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందే అవకాశం వుంది. ఇక ఏ వయసు వారు తీసుకోవచ్చు అనేది చూస్తే.. 13 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకో వచ్చు.

28 ఏళ్ల వయసులో రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకున్నారు అనుకోండి… నెలకు దాదాపు రూ.4800 ప్రీమియం కట్టాలి. అంటే రోజుకు రూ.160 ఆదా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 5 ఏడాది రూ.లక్షన్నర వస్తుంది. పదో ఏడాదిలో మళ్లీ రూ.1.5 లక్షలు వస్తాయి. ఐదవ ఏడాది రూ.లక్షన్నర వస్తుంది. పదో ఏడాదిలో మళ్లీ రూ.1.5 లక్షలు వస్తాయి.

15 వ ఏడాది చివరిలో, 20వ ఏడాది చివరిలో రూ.1.5 లక్షల చొప్పున లభిస్తాయి. ఇక 25వ ఏడాది చివరిలో రూ.17.2 లక్షలు వస్తాయి. ఇలా ఇరవై మూడు లక్షలు పొందొచ్చు. పాలసీ టర్మ్ 25 ఏళ్లు. మీరు పాలసీ తీసుకున్న తర్వాత ప్రతి ఐదేళ్లకు ఒకసారి 15-20 శాతం వరకు డబ్బులు వస్తాయి.