ఈ సంవత్సరంలో రెండు బోర్డు ఎగ్జామ్స్.. సీబీఎస్ఈ సరికొత్త విధానం.

-

మహమ్మారి వలన విద్యార్థుల బోర్డు పరీక్షల్లో ఎంత గందరగోళం ఏర్పడుతుందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సిలబస్ ఎడ్యుకేషన్ సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. 2021-22సంవత్సరానికి గాను రెండు బోర్డ్ ఎగ్జామ్ నిర్వహించాలని భావిస్తుంది. ఒకే బోర్డ్ ఎగ్జామ్ కారణంగా పరీక్ష్ల రద్దు వంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఇలాంటి నిర్ణయం తీసుకుంది. టర్మ్ 1, టర్మ్ 2 పేరుతో రెండు ఎగ్జామ్స్ నిర్వహించాలని అనుకుంటుంది. దీని ప్రకారం సంవత్సరంలో రెండు ఎగ్జామ్స్ ఉంటాయి. వాటిల్లో వచ్చిన మార్కులని తీసుకుని ఫలితాలను విడుదల చేస్తారు.

ఈ రెండు టర్ముల్లో సిలబస్ కూడా వేరే విధంగా ఉంటుంది. మొదటి అర్థ సంవత్సరానికి 50శాతం సిలబస్ ఉంటుంది. రెండవ టర్మ్ కి మిగతా యాభైశాతం సిలబస్ ఉంటుంది. ఈ పరీక్షల సమయం 90నిమిషాలు ఉంటుంది. మార్కింగ్ స్కీమ్ ఆధారంగా క్వశ్చన్ పేపర్ ని సీబీఎస్ఈ తయారు చేస్తుంది. సీబీఎస్ఈ నియమించిన అధికారుల సమక్షంలోనే ఈ పరీక్షలు జరుగుతాయి. నవంబరు -డిసెంబర్ మధ్య కాలంలో మొదటి టర్మ్ ఉంటుంది. మార్చ్- ఏప్రిల్ కాలాల్లో రెండవ టర్మ్ ఉంటుంది.

పరీక్షలతో పాటు పరీక్ష పేపరు కూడా మారనుంది. మొదటి టర్మ్ లోని మొదటి పేపర్ లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. రెండవ పేపర్ లో విభిన్న రకాలైన ప్రశలు ఇస్తారు. ఈ పద్దతి ప్రకారమే సిలబస్ కూడా తయారు చేస్తున్నారు. మొదటి సగభాగాన్ని మొదటి టర్మ్ లో, రెండవ సగభాగాన్ని రెండవ టర్మ్ లో బోధిస్తారు. పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ మార్చిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోతే 2గంటల బోర్డు పరీక్షను పెట్టాలని భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news