బ్యాంకింగ్ క‌స్ట‌మ‌ర్ల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌

-

బ్యాంక్ డిపాజిట్లకు ఇన్సూరెన్స్ కవరేజ్ మొత్తాన్ని పెంచుతూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే క‌వ‌రేజీ ఎంత మొత్తంలో పెంచుతున్న విష‌యంపై మాత్రం ఇంకా స్ప‌ష్టత ఇవ్వ‌లేదు. ఈమేర‌కు కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మీడియాకు తెలిపారు. మోదీ సర్కారు చేప‌ట్టిన మ‌రో సంస్క‌ర‌ణ‌గా బ్యాంకింగ్ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. పీఎంసీ బ్యాంకులో ఏర్ప‌డిన సంక్షోభం నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బ్యాంక్ డిపాజిట్లకు రూ.లక్ష వరకు బీమా కవరేజ్ లభిస్తోంది. బ్యాంక్ డిపాజిట్లకు 1993 నుంచి రూ.లక్ష వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కొనసాగుతూ వస్తోంది. దీని కన్నా ముందు రూ.30,000 కవరేజ్ ఉండేది. మరోవైపు కోఆపరేటివ్ సెక్టర్‌లో అతిపెద్ద ఎన్‌జీవో అయిన సహకార్ భారతీ డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ మొత్తాన్ని రూ.5లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాయ‌డం గ‌మ‌నార్హం.

Central Government Good News For Banking Customers

ప్ర‌స్తుత తాజా విధానంపై ప్రాథ‌మిక నిర్ణ‌యానికి వ‌చ్చిన కేంద్ర ప్ర‌భుత్వం ముందుగా కేబినేట్‌లో కూడా చ‌ర్చ‌లు పూర్తి చేసింద‌ని సీతారామ‌న్ వెల్లడించారు. వ‌చ్చే శీతాకాలం పార్ల‌మెంట‌రీ స‌మావేశాల్లో బిల్లును ప్ర‌వేశపెట్టి చ‌ట్టం చేయాల‌ని ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసిన‌ట్లు పేర్కొన్నారు. బ్యాంక్ డిఫాల్ట్ అయితే లేదంటే బోర్డు తిప్పేస్తే ఈ మొత్తం కస్టమర్లకు ఈ మొత్తం లంభించ‌నుంది. ఇటీవల పీఎంసీ బ్యాంక్ నేపథ్యంలో డిపాజిట్ స్కీమ్ వార్తల్లో నిలిచింది.

ఇదిలా ఉండ‌గా బ్యాంక్ డిపాజిట్లకు బీమా కవరేజ్ అందించే డీఐసీజీసీ ప్రస్తుతం రూ.100 డిపాజిట్‌కు 10 పైసల ప్రీమియం వసూలు చేస్తోంది. అన్ని బ్యాంకులకు ఇదే వ‌ర్తిస్తోంది. 2005 ఏప్రిల్ నుంచి ఈ ప్రీమియం అమలులోకి వచ్చింది. గతంలో ప్రీమియం 8 పైసలుగా ఉండేది. డీఐసీజీసీ ప్రకారం.. 2019 మార్చి 31 నాటికి 217.4 కోట్ల అకౌంట్లలో 200 కోట్ల అకౌంట్లకు కవరేజ్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version