పెళ్లితరువాత పాన్ కార్డులో ఇంటిపేరు మార్చటం ఎలా..అసలు అవసరమా మార్పు..!

-

పెళ్లి తరువాత మహిళలు వారి పాన్ కార్డులో పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. చాలామందికి పాన్ కార్డులో మార్చటం అవసరమా కాదా అనే అనుమానం కూడా ఉంటుంది. పెళ్లికి ముందు పాన్ కార్డ్ తీసుకుంటే అప్పుడు మన ఇంటిపేరు ఉంటుంది. కానీ హిందూ సంప్రదాయం ప్రకారం..మహిళలకు పెళ్లి తర్వాత ఇంటిపేరు కూడా మారిపోతుంది. అప్పుడు సర్టిఫెకెట్స్, ఆధార్, పాన్ వంటివాటిల్లో ఇంటి మార్చాలా అని సందేహం. సర్టిపికెట్స్ లో ఎలాగో మార్చలేము. కానీ పాన్ కార్డులో మార్చుకోవచ్చు. అప్పుడు సంతకం కూడా మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. పాన్ కార్డులో మార్పులు చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడే తెలుసుకుందాం..

pan-cardకావాల్సిన డాక్యుమెంట్స్:

పాన్ కార్డులో మార్పులుచేయాలనుకునే మహిళలు తప్పనిసరిగా వివాహానికి సంబంధించిన సర్టిఫికెట్, పెళ్లికార్డు, ఏదైనా వార్తపత్రికలో మీ ఇంటిపేరు మార్చుకున్నట్లు ప్రకటన, మీ భర్తది ఏదైనా ఐడీ ప్రూఫ్ కావాల్సి ఉంటుంది. అయితే ఆ ఐడీ ఫ్రూఫ్ లో మీ భర్త ఇంటిపేరు, చిరుమానా కరెక్ట్ గా ఉండాలి, ఇంకా వీటితో పాటు ఒక ఫోటోకాపీ జతచేయండి.

నింపాల్సిన ఫారం

పాన్ కార్డులో పేరు మార్చడానికి మీరు ఒక ఫారమ్ నింపాలి. అందులో మనం ఏదైతే మార్చాలి అనుకుంటున్నామో అక్కడ మార్పులు చేయాలి. అంటే ఆ కాలమ్ దగ్గర టిక్ చేయాలి. ఒకవేళ పాన్ కార్డులో సంతకం మార్చాలి అన్నా ఇప్పుడే ఆ ఫారమ్ లోనే చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ సంస్థ పాన్ కార్డులో మార్పు చేయాలనుకుంటే:

మీరు భాగస్వామ్య సంస్థలో పని చేసి, పాన్ కార్డ్‌ని మార్చాలనుకుంటే, మీరు మీ భాగస్వామి లేదా భాగస్వామ్య ఒప్పందం యొక్క కాపీని సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు కూడా పైన చెప్పిన ఫారమ్ నే ధరఖాస్తుదారులు నింపాలి. దీనితో పాటు, అవసరమైన పత్రాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

వివాహం తర్వాత పాన్ కార్డులో ఇంటిపేరు మార్చడం అవసరమే

వివాహం తర్వాత మీ ఇంటిపేరు మారినట్లయితే కచ్చితంగా మీ పాన్ కార్డులో కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ మీ దరఖాస్తును ఆమోదించిన తర్వాత పోస్ట్ ద్వారా మీకు కొత్త కార్డు వస్తుంది.

ప్రతిచోటా కొత్త పాన్ కార్డే ఇవ్వాలి

పాన్ కార్డు అవసరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు మీ కొత్త కార్డునే ఇవ్వాలి. ఉన్నాయికదా అని పాతది ఇవ్వకూడదు.

ఇంటిపేరు మారిస్తే పాన్ నంబర్ మారదు

పాన్ కార్డులో ఇంటిపేరు లేదా సంతకం మార్చితే పాన్ నంబర్‌ మారదు, పాతదే ఉంటుంది.. కాబట్టి మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాన్ నంబర్ అంటే ఒక వ్యక్తికి ఇచ్చే శాశ్వత సంఖ్య. కాబట్టి మీరు మార్పులు చేసినప్పుడు అవి మాత్రమే మారుతాయి, ప్రతిసారి కొత్త కొత్త నంబర్లు రావు.

ఇదండి ప్రాసెస్..మీరు ఒకవేళ పాన్ కార్డులో మార్పులు చేయకుండా కేవలం ఆధార్ మాత్రమే మార్చేశారంటే..చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మన పేరు, మన గుర్తింపు మనకు సంబంధించిన అన్ని పత్రాల్లో ఒకేలా ఉండాలి లేకుంటే ప్రతిదాంట్లో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news