ఆధార్ కార్డు మొదలు సుకన్య సమృద్ధి దాకా.. అక్టోబర్ 1 నుంచి మారబోతున్న అంశాలు ఇవే..!

-

ప్రతి నెలా ఒకటవ తారీఖున కొన్ని రూల్స్ మారుతాయి. అలాగే అక్టోబర్ 1 నుంచి కూడా కొన్ని రూల్స్ మారబోతున్నాయి. అక్టోబర్ 1 నుంచి ఎలాంటి అంశాల్లో మార్పులు వస్తున్నాయి అనేది చూద్దాం. మైనర్ పేరు మీద PPF ఖాతా తెరవడానికి అర్హత పొందే దాకా అంటే 18 ఏళ్ళు వచ్చేవరకు వాళ్ళ పేరుపై ఉండే ఖాతాలకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లకు చెల్లించే వడ్డీ అందించబడుతుంది. 18 తర్వాత మాత్రమే వర్తించే వడ్డీ రేటు చెల్లించబడుతుంది. మెచ్యూరిటీ వ్యవధి మైనర్ పెద్దవాడైన తేదీ నుంచి లెక్కించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఖాతా తెరవడానికి మైనర్ వ్యక్తి వాస్తవంగా అర్హత పొందిన తేదీ నుంచి లెక్క పెడతారు. ఒకటి కంటే ఎక్కువ PPF ఖాతాలు ఉన్నట్లయితే ప్రైమరీ ఖాతాకు స్కీమ్ అందించే వడ్డీ రేటు చెల్లిస్తారు.

ప్రతి నెలా ఒకటవ తేదీన చమురు విక్రయిదారులను LPG సిలిండర్ ధరల్లో మార్పులను ప్రకటించొచ్చు. అలాగే అక్టోబర్ 1 కూడా ఈ రేట్లు మారే అవకాశం ఉంది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లలో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో డొమెస్టిక్ గ్యాస్ ధరలలో మార్పులు ఉండకపోవచ్చు. చిన్న పొదుపు పథకాలలో ముఖ్యంగా కుమార్తెల భవిష్యత్తు కోసం భారత ప్రభుత్వం అందిస్తున్న సుకన్య సమృద్ధి ఖాతాల విషయంలో పారదర్శకతను పెంచడానికి కొత్తగా తెస్తున్న నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమలు కాబోతున్నాయి.

చట్టబద్ధమైన సంరక్షకులు కాకుండా ఇతరులు అంటే తాతమామలు సంరక్షకత్వంలో ఖాతాలు తెరిచినట్లయితే గార్డియన్ యాక్ట్ ప్రకారం సహజ సంరక్షకులుగా సజీవంగా ఉన్న తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డెన్ కు బదిలీ చేయబడుతుంది. అలాగే మార్గదర్శకాలకు విరుద్ధంగా తెరిచిన ఖాతాగా పరిగణించడం ద్వారా సక్రమంగా లేని ఖాతాలని క్లోజ్ చేసేస్తారు. అక్టోబర్ 1 నుంచి పాన్ కార్డు విషయంలో కూడా కొన్ని మార్పులు జరగబోతున్నాయి ఆధార్ నెంబర్ కి బదులుగా ఆధార్ నమోదు ఐడిని ఉదాహరించడానికి అనుమతించే నిబంధనలు ఐటిఆర్ లలో ఆధార్ పాన్ దరఖాస్తులకు ఇకపై వర్తించవు.

Read more RELATED
Recommended to you

Latest news