ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా…? అయితే ఈ వివరాలు మీకోసం..!

మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే తక్కువ వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చే బ్యాంక్స్ డీటెయిల్స్ ని చూడండి. ఉన్నత విద్య అభ్యసించడానికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. అన్ని బ్యాంకులు విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తుంటాయి. దీని వలన చదువు కోసం డబ్బులు తీసుకొచ్చు.

ఉద్యోగం వచ్చాక ఆ డబ్బులు తిరిగి కట్టేయచ్చు. ఎడ్యుకేషన్ లోన్ తల్లిదండ్రులైనా పిల్లలైనా తీసుకోవచ్చు. ఇక ఏ బ్యాంక్ లో ఎంత వడ్డీ రేట్లు ఉన్నాయనేది చూద్దాం… ప్రస్తుతం ఈ వడ్డీ రేట్లు 6.70 శాతం నుంచి 15.50 శాతం వరకు ఉన్నాయి. ఒక్కో బ్యాంక్ కి ఒక్కో రేటు ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా లో వడ్డీ రేటు 6.75 శాతం, యూనియన్ బ్యాంక్ లో 6.80 శాతం, సెంట్రల్ బ్యాంక్ లో అయితే 6.85 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 6.85 శాతంగా వుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.85 శాతం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.90 శాతం, ఐడీబీఐ బ్యాంక్ లో 6.90 శాతం. అలానే కెనెరా బ్యాంక్ లో కూడా 6.90 శాతంగా వుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో 7.05 శాతం, ఇండియన్ బ్యాంక్ లో 7.15 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 7.25 శాతంగా వుంది.

యూకో బ్యాంక్ అయితే 7.30 శాతం, సౌత్ ఇండియన్ బ్యాంక్ లో 7.70 శాతం, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ లో 8.30 శాతం గా వుంది. అలానే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో 9.55 శాతం. యాక్సిస్ బ్యాంక్లో 9.70 శాతం, ఫెడరల్ బ్యాంక్ అయితే 10.05 శాతం. ధనలక్ష్మి బ్యాంక్ లో 10.50 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ లో 10.50 శాతం, కరూర్ వైశ్య బ్యాంక్ లో 10.75 శాతం, కర్నాటక బ్యాంక్ 12.19 శాతంగా వుంది. సిటీ యూనియన్ బ్యాంక్ లో 15.50 శాతం వుంది.