పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? ఈ చిన్న తప్పులే కారణం…!

Join Our Community
follow manalokam on social media

పీఎం కిసాన్ డబ్బులు రాలేదంటే ఈ చిన్న తప్పులని చేసి ఉంటారు ఒక సారి చెక్ చేసుకోండి.
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను అందిస్తున్న సంగతి తెలిసినదే. ఇలా ప్రవేశ పెట్టడానికి కారణం రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతోనే. పీఎం కిసాన్ వారికి ఆర్థిక చేయూత అందిస్తుందని కేంద్రం ఈ స్కీమ్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది. దీనితో ప్రతి ఏడాది రూ.6 వేలు రైతులకి లభిస్తాయి.

ఈ రూ.6,000 ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి. 4 నెలలకు ఒకసారి పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.2,000 రైతులకు అందుతాయి. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు 7 విడతల డబ్బు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యింది. మీకు ఇంక డబ్బులు రాలేదా..? అయితే ఒక్కోసారి చిన్న పొరపాట్లే కారణం అవ్వొచ్చు. ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ వివరాలు తప్పు ఉంటె చెక్ చేసుకోవడం మంచిది. ఒకవేళ మీరు కరెక్ట్ చేసుకోవాలంటే ఇలా చెయ్యండి. నేరుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్‌సైట్‌కు వెళ్లి మీ వివరాలను కరెక్ట్ చేసుకోవచ్చు.

మొదట https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఆ తరువాత ఫార్మర్స్ కార్నర్‌ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆధార్ ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని పై క్లిక్ చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆధార్ నెంబర్ ని సరి చేసుకోవచ్చు. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్‌లో తప్పులు ఉంటే మీ అకౌంటెంట్‌ను సంప్రదించండి. రాష్ట్ర ప్రభుత్వం మీ బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్‌ను వెరిఫై చేస్తేనే మీకు ఇవి వస్తాయి. లేదంటే ఈ డబ్బులు మీకు రావు. కాబట్టి వీటిల్లో తప్పులు ఉంటే మార్పు చెయ్యడం మంచిది.

TOP STORIES

మీరు చేసే జాబ్ మీకు హ్యాపీగా అనిపించాలంటే వీటిని అనుసరించండి..!

మనం చేసే పని వల్ల మనకి ఆనందం మాత్రమే కలగాలి. ఇష్టపడుతూ జాబ్ చేయడం వల్ల ఫ్రస్ట్రేషన్, సాటిస్ఫాక్షన్ లేకపోవడం లాంటివి ఉండవు. అలానే ఎప్పుడూ...