మాస్టర్ సినిమా డిజిటల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..

-

తమిళ నటుడు విజయ్ నటించిన మాస్టర్ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం నుండి అనుకున్న సినిమా బయటకి రాలేదని, అంచనాలని అందుకోలేకపోయిందని పెదవి విరుస్తున్నారు. అదలా ఉంచితే కమర్షియల్ గా మాస్టర్ సినిమా పెద్ద హిట్ అనే చెప్పుకోవాలి. తమిళంలో ఈ సినిమాకి విపరీతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఇటు తెలుగులోనూ ఫర్వాలేదనిపించుకుంది. లెక్కల పరంగా మాస్టర్ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. థియేటర్లకి ప్రేక్షకులని లాక్కురావడంలో సక్సెస్ అయిన మాస్టర్ సినిమా డిజిటల్ హక్కులని కొనుక్కోవడానికి చాలా మంది పోటీ పడ్డారు.

అత్యధిక డబ్బులు పెట్టి డిజిటల్ హక్కులని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవనుంది. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 12వ తేదీన మాస్టర్ సినిమా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రయిబర్లందరికీ అందుబాటులో ఉండనుంది. సినిమా రిలీజైన సరిగ్గా నెల తర్వాత డిజిటల్ వేదికగా మాస్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news