ఈ యాప్ మీ మొబైల్ లో ఉందా..? అయితే మీ బిల్లుపై సగం డబ్బులు తగ్గింపు పొందండి..!

సామాన్య మానవుడికి ప్రతి నెల కొన్ని ఖర్చులు ఉంటాయి. నెల వచ్చేటప్పటికి మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ రీచార్జ్, పెట్రోల్ ఖర్చు, గ్యాస్ సిలిండర్ ఖర్చు, ఇంట్లో సరుకులు ఇలా ఎన్నో రకాల ఖర్చులు ఉంటాయి. అన్ని కట్టేటప్పటికి సామాన్యుడి నెత్తిమీద భారం పడినట్లే. అయితే ఇలా కట్టే బిల్లుల్లో కొన్నింటికైనా మనకు క్యాష్‌ బ్యాక్ లభిస్తే చాలని అనుకుంటూ ఉంటాము కదా.. అయితే ఇప్పుడు చెప్పబోయే శుభవార్త మీకోసమే.

ఇప్పుడు ఒక అదిరిపోయే యాప్ అందరికి అందుబాటులో ఉంది. అయితే ఈ యాప్ ద్వారా పలు బిల్లులపై క్యాష్‌ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. దాని పేరు ఏంటంటే FYOOL యాప్. అయితే ఈ యాప్ కూడా పేటీఎం, ఫోన్‌పే వంటి యాప్ లాంటిది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యాప్ ద్వారా బిల్లు చెల్లింపుపై ఏకంగా సగం తగ్గింపు పొందొచ్చు. అంటే పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, లిక్కర్ బిల్లు చెల్లింపులపై ఈ యాప్ ద్వారా క్యాష్ ‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు కూడా. ఈ డబ్బుతో మీరు ఇంట్లోకి సరుకులు కొనొచ్చు. లేదంటే వేరే ఎవరికైనా పంపించుకోవచ్చు. ఈ యాప్ ను ఢిల్లీకి చెందిన రౌనక్ శర్మ రూపొందించారు. ఈయన పలు కంపెనీలతో భాగస్వామ్యం కూడా కుదుర్చుకున్నారు.

అయితే ఇక్కడ మీరు ఈ యాప్ ద్వారా నేరుగా కొనుగోలు చేసి క్యాష్‌బ్యాక్ పొందడానికి వీలు లేదు. ఇది పేటీఎం మాదిరి లాంటి యాప్ కాదు మీరు. మీరు పెట్రోల్ కొట్టించుకున్న బిల్లు లేదా షాపింగ్ బిల్లులను ముందుగా ఈ యాప్‌లో అప్‌ లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేసిన తరువాత మీకు మీ బిల్లుపై సగం క్యాష్‌ బ్యాక్ వస్తుంది. అయితే మీరు ఒక్క విషయాన్నీ గమనించాలి. మీరు క్యాష్ బ్యాక్ పొందాలంటే కనీసం రూ.2,000 లోపు బిల్లు చేయాలి. రెండువేల లోపు బిల్లులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఈ యాప్ ను మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని బెనిఫిట్స్ ను పొందండి.