ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, గడువులోపు పన్ను చెల్లింపుదారులు తమ పత్రాలను ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైతే, పాన్ కార్డులు పనిచేయవు. అదనంగా, అటువంటి PANకి సంబంధించి ఎటువంటి వాపసు చేయబడదు. బయోమెట్రిక్ డాక్యుమెంట్‌తో PANని లింక్ చేయడంలో విఫలమైతే TDS మరియు TCS తగ్గింపు/వసూళ్ల అధిక రేట్లు ఉంటాయి. రూ. 1,000 ఆలస్య జరిమానా చెల్లించడం ద్వారా పాన్‌ను మళ్లీ యాక్టివేట్ చేయవచ్చు. చాలా మంది.. జరిమానా కట్టి పాన్ కార్డునుయాక్టివేట్ చేసుకున్నారు. మరి ఆ జరిమానాల ద్వారా ఎంత డబ్బు వచ్చిందో తెలుసా..?
గడువులోగా తమ పాన్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోలేకపోయిన డిఫాల్టర్‌ల నుంచి రూ.600 కోట్లకు పైగా పెనాల్టీని కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. ఇప్పటి వరకు 11.48 కోట్ల పాన్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చింది. మినహాయింపు పొందిన కేటగిరీని మినహాయిస్తే, జనవరి 29, 2024 నాటికి ఆధార్‌తో లింక్ చేయని పాన్‌ల సంఖ్య 11.48 కోట్లు అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వ్యక్తుల నుంచి జూలై 1, 2023 నుంచి జనవరి 31, 2024 వరకు రుసుము రూ.601.97 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయడం ఎలా?
గడువు ముగిసిన తర్వాత కూడా తమ పాన్ మరియు ఆధార్‌ను లింక్ చేయని వారు రూ. 1,000 జరిమానా చెల్లించి రెండు పత్రాలను లింక్ చేయడం ద్వారా దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ప్రక్రియ తర్వాత, పాన్ కార్డ్ మళ్లీ యాక్టివేట్ కావడానికి దాదాపు ఒక నెల పడుతుంది. ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు పాన్ కార్డ్‌ని మళ్లీ యాక్టివేట్ చేయవచ్చు. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడానికి ఐదు నిమిషాల కూడా పట్టదు.. సోషల్ మీడియా, వార్తసంస్థలు ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించారు.. అయినా ఇంత మంది పాన్ కార్డును ఆధార్‌కు లింక్ చేసుకోకుండా..తమ జేబులు ఎందుకు ఖాళీ చేసుకుంటున్నారో.. ఉచితంగా అయ్యే పనికి ఇప్పుడు వెయ్యికట్టాల్సి వచ్చింది.. ఇప్పటికైనా లింక్ చేసుకోకపోతే.. భవిష్యత్తు ఈ జరిమానా పెంచే అవకాశం కూడా లేకపోలేదు..! ఇకనైనా త్వరపడండి.!