భారతదేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ ఇప్పుడు క్రెడిట్ కార్డును ఇస్తోంది. ఎల్ఐసీ కంపెనీ ఇప్పుడు యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులతో కలిసి టైఅప్ అయ్యి ఈ క్రెడిట్ కార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే..వినియొగదారులకు ఎన్నో బెనిఫిట్స్ తో పాటు ఇన్సూరెన్స్ చెల్లించే వెసులుబాటును కూడా ఎల్ఐసీ కల్పిస్తోంది..ఇక ఈ క్రెడిట్ కార్డులు ప్రీమియం డిపాజిట్ చేసేందుకు ఉపయోగపడటమే కాకుండా అనేక ప్రయోజనాలు కూడా పొందొచ్చు.
యాక్సిస్ బ్యాంకుతో టైఅప్ అయిన ఎల్ఐసీ మూడు రకాల క్రెడిట్ కార్డులను తమ యూజర్లకు అందిస్తూ వస్తోంది. ఇందులో ఎల్ఐసీ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ ప్లాటినం క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ టైటానియం క్రెడిట్ కార్డు వంటివి మూడు ఉన్నాయి.అంతేకాదు..సిగ్నేచర్ క్రెడిట్ కార్డు యూజర్లు చెల్లించే ప్రతి వంద రూపాయలు ప్రీమియం డిపాజిట్‌కు 2 రివార్డు పాయింట్లు అందించడమే కాకుండా ఖర్చు చేసే ప్రతి వంద రూపాయలకు 1 రివార్డు పాయింట్ ను ఇస్తుంది. ఈ కార్డు వల్ల వ్యక్తిగత ప్రమాద భీమా 5 లక్షలు, యాక్సిడెంట్ కవరేజ్ 1 కోటి రూపాయల వరకూ ఉంది..
ఇకపోతే ఎల్ఐసి ప్లాటినం క్రెడిట్ కార్డు ద్వారా మీరు చెల్లించే ప్రతి వంద రూపాయల ప్రీమియం డిపాజిట్‌పై 2 రివార్డు పాయింట్లు లభించడమే కాకుండా వ్యక్తిగత ప్రమాద భీమా కింద 3 లక్షలు వస్తుంది. అలాగే ఎయిర్ యాక్సిడెంట్ బీమా 1 కోటి రూపాయల వరకూ అందుతుంది. ఎల్ఐసీ టైటానియం క్రెడిట్ కార్డులో కూడా చెల్లించే ప్రతి వంద రూపాయల ఎల్ఐసీ ప్రీమియం డిపాజిట్‌పై 2 రివార్డు పాయింట్లు వస్తాయి.కార్డు నుంచి 100 రూపాయలు ఖర్చు చేస్తే 1 రూపాయి రివార్డు కూడా వస్తుంది..