పాన్ కార్డ్ నంబరులో దాగున్న సమాచారం మీకు తెలుసా..?

Join Our COmmunity

ఆర్థికపరమైన లావాదేవీలకి పాన్ కార్డ్ ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ వారు అందించే పాన్ కార్డు గురించి మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. బ్యాంకుల్లో 50వేల కంటే ఎక్కువ డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా పాన్ కార్డ్ ఖచ్చితంగా కావాల్సిందే. స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి పాన్ కార్డ్ కంపల్సరీ. అయితే పాన్ కార్డులో నంబరులో ఉండే సమాచారం చాలా మందికి తెలియదు.

పాన్ కార్డ్ లో పేరు, తండ్రి పేరు, పుట్టినతేదీ, ఆ తర్వాత పాన్ నంబరు ఉంటాయి. చాలామందికి తెలియని అంశం పాన్ కార్డ్ లో అడ్రస్ ఉండదు. అలాగే అమ్మాయిలకి పెళ్ళయ్యాక వాళ్ళ పేరు పక్కన భర్త పేరు రాసుకుంటారు. కానీ పాన్ కార్డులో పెళ్ళైన అమ్మాయిల పేరు పక్కన తండ్రి పేరే ఉంటుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే, పాన్ నంబరులో ఆరు ఆంగ్ల అక్షరాలతో పాటు నాలుగు అంకెలు ఉంటాయి. ఈ ఆరు అక్షరాలు ఏమేమి సూచిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

మొదటి మూడు అంగ్ల అక్షరాలని వదిలేస్తే నాలుగవ ఆంగ్ల అక్షరానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది.ఈ అక్షరం ఆ వ్యక్తి స్టేటస్ ని తెలియజేస్తుంది. ఆ అక్షరం పి అయితే పర్సనల్ అనీ, హెచ్ అయితే హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ అనీ, సి అయితే కంపెనీ అనీ, టి ట్రస్ట్, బీ బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్, ఎల్ లోకల్, జె అంటే ఆర్టీఫీషియల్ జ్యుడిషియల్ పర్సన్, జి అంటే గవర్నమెంట్ అని అర్థం.

ఇక ఐదవ అక్షరం ఆ వ్యక్తి ఇంటిపేరుని తెలియజేస్తుంది. పాన్ తీసుకున్న వ్యక్తి సర్ నేమ్ తనికెళ్ళ అయితే టీ అనీ తెలియజేస్తుంది. ఇక అంకెలనేవి ఇన్ కమ్ టాక్స్ లో సీరియల్ నంబర్ గా ఉంటుంది. చివరి ఆంగ్ల అక్షరాన్ని ఇన్ కమ్ డిపార్ట్ మెంట్ వారు ఏ నుండి జెడ్ వరకు ఏదైనా ఇవ్వవచ్చు.

TOP STORIES

మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడుతున్నారా? ఈ విషయాలు తెలుకోండి..

పెళ్ళి.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. ఇద్దరు వ్యక్తులను ఒకే దారిలో నడిపేది. మానవుడు అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమంలో పెళ్ళనేది అతడు సృష్టించుకున్న అత్యంత...