మీరు ఎక్కడ సెటిల్ అయితే అక్కడే ఓటేయాలనుకుంటున్నారా? అయితే ఈ పని చేయండి…!

-

కేవలం ఓటేయడం కోసం వేల కిలోమీటర్ల ప్రయాణించాలి అంటే మాత్రం వాళ్లు ఓటేయడానికి అంతగా ఆసక్తి చూపించరు. ఓటేయడం మానేసుకుంటారు. వాళ్లకు ఓటేయాలని మనసులో ఉన్నా.. అంత దూరం వెళ్లలేక.. లేదా ఇతర సమస్యల వల్ల ఓటేయరు.

చాలామంది పుట్టింది.. పెరిగింది ఒక ఊళ్లో అయితే.. సెటిల్ అయ్యేది ఇంకో ఊళ్లే. ఉద్యోగం కోసమో.. వ్యాపారం కోసమో.. పిల్లల చదువుల కోసమో.. వేరే ఊళ్లో లేదా సిటీలో సెటిల్ అవుతుంటారు చాలామంది. ఇటువంటి వాళ్లకు ఎప్పుడు సమస్య వస్తుందంటే.. ఓట్ల పండుగ వచ్చినప్పుడు. ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్లు ఓటేయాలంటే వీళ్లు ఊరికి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఎందుకంటే.. వీళ్ల ఓటు ఉండేది వీళ్లు పుట్టిన ఊరిలో. వీళ్లు ఉండేది వేరే ఊరిలో. అయితే.. వీళ్లు సెటిల్ అయిన ఊరుకు తమ సొంత ఊరు దగ్గరగా ఉంటే పర్లేదు. కానీ.. కేవలం ఓటేయడం కోసం వేల కిలోమీటర్ల ప్రయాణించాలి అంటే మాత్రం వాళ్లు ఓటేయడానికి అంతగా ఆసక్తి చూపించరు. ఓటేయడం మానేసుకుంటారు. వాళ్లకు ఓటేయాలని మనసులో ఉన్నా.. అంత దూరం వెళ్లలేక.. లేదా ఇతర సమస్యల వల్ల ఓటేయరు. దాని వల్ల ఓటింగ్ శాతం విపరీతంగా తగ్గుతుంది. ఏ ఎన్నికల్లో అయినా ఓటింగ్ శాతం వందకు వంద శాతం ఉండదు. ఇటువంటి వాళ్లు ఓటేయలేకపోవడం కూడా ఓ కారణం.

Want to vote where you settle fill form 6 in NVSP portal

అయితే.. ఈ సమస్య ఇప్పటిది కాదు.. చాలా రోజుల నుంచి ఉన్నదే. అయితే.. కేంద్ర ఎన్నికల సంఘం దీనికి బ్రహ్మాండమైన ఆలోచన చేసింది. అదే ఫామ్ 6. ఈ ఫామ్ వల్ల మీరు మీ ఓటర్ ఐడీలో అడ్రస్ మార్చుకుంటే చాలు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఓటెయ్యొచ్చు. ఓటేయడం కోసం ఊరికి పోవాల్సిన అవసరమే లేదు.

దాని కోసం మీరు www.nvsp.in/Forms/Forms/Form6 లింక్ ను ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే సెటిల్ అయ్యారో ఆ ఆడ్రస్ ను ఇస్తే చాలు. ఈ ఫాం అడ్రస్ మార్చుకునే వాళ్లకే కాదు.. మొదటి సారి ఓటర్ ఐడీ కోసం అప్లయి చేసుకునే వాళ్లకు కూడా ఇదే ఫాం వర్తిస్తుంది.

అయితే.. మీరు ఫామ్ 6 నింపడానికి ముందు… మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్లు ఉండాలి. ముందుగా పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను స్కాన్ చేసి పెట్టుకోండి.

ఏజ్ ప్రూఫ్ కోసం ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి…

ఏజ్ ప్రూ కోసం మీ పదో తరగతి మార్కుల మెమో కానీ.. భారత పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డులో ఏదో ఒకటి ఉంటే చాలు.

అడ్రస్ ప్రూఫ్ కోసం ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి…

అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఐటీ అసెస్ మెంట్ ఆర్డర్, రెంటల్ అగ్రిమెంట్, వాటర్ బిల్, టెలిఫోన్ బిల్, బ్యాంక్ పాస్ బుక్, కిసాన్ పాస్ బుక్, పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, గ్యాస్ కనెక్షన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది.

ఇవి స్కాన్ చేసి ఫామ్ ఓపెన్ చేసి ఫామ్ ను నింపేయండి. మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీకి మెసేజ్ వస్తుంది. వెరిఫికేషన్ అనంతరం మీ ఓటర్ ఐడీలో అడ్రస్ మారడంతో పాటు.. మీరు చేంజ్ చేసిన అడ్రస్ ఏ నియోజకవర్గం పరిధిలోకి వస్తే.. ఆ నియోజకవర్గంలోనే మీరు ఓటేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news