పిల్లలు తల్లి ఇంటి పేరు వినియోగించుకోవచ్చు.. వద్దనే హక్కు తండ్రికి లేదు: ఢిల్లీ హైకోర్టు

-

న్యూఢిల్లీ: మన దేశంలో తండ్రి పేరే కొడుకు, కూతురుకు అనవాయితీగా వస్తోంది. కూతురుకి పెళ్లి అయితే ఆమె భర్త ఇంటి పేరు హక్కుగా వస్తోంది. అయితే ఢిల్లీలో కూతురు మైనర్‌గానే ఉండగా తల్లి ఇంటి పేరును వినియోగించుకుంటున్నారు. దీంతో తండ్రి కోర్టును ఆశ్రయించారు. తన కూతురుకి తల్లి ఇంటి పేరు వినియోగించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కోర్టు తీర్పు విభిన్నంగా వచ్చింది. కచ్చితంగా తండ్రి ఇంటి పేరే ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. పిల్లలకు ఇష్టమైతే తల్లి ఇంటిపేరు కూడా వినియోగించుకోవచ్చని తీర్పు ఇచ్చింది.

అంతేకాదు తమ ఇంటి పేరు చేర్చేలా ఆదేశాలివ్వాలని తండ్రి వేసిన పిటిషన్‌పై తోసిపుచ్చింది బాలిక ఇంటి పేరును మార్చేలా ఆదేశాలివ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. కుమార్తె కచ్చితంగా తండ్రి పేరు వినియోగించాలనే హక్కు తండ్రికి లేదని తెలిపింది. కుమర్తె తన తల్లి పేరు వినియోగించుకోవాలనుకుంటే తండ్రికి వచ్చిన ఇబ్బందేందని ప్రశ్నించింది. తన కుమార్తె బాలిక అని.. ఆమె తల్లి బలవంతంగా వాళ్ల తండ్రి ఇంటి పేరుగా మార్చుకున్నారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ నేను నా కుమార్తెకు ఇన్సూరెన్స్ చేయించా. ఆ దరఖాస్తులో నా ఇంటి పేరుతో కూతురు పేరు రాయించా. తల్లి ఇంటి పేరు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి  నా ఇంటి పేరునే కూతురు కచ్చితంగా వినియోగించాలి.’’ అని తండ్రి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కచ్చితంగా తండ్రి ఇంటి పేరును కూతురు వియోగించుకునేలా ఆదేశాలు ఇవ్వలేమని వెల్లడించింది. కూతురు ఇంటి పేరు మార్చుకోవాలంటే స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తండ్రికి కోర్టు సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news