ఈపీఎఫ్ వడ్డీ రేటు ప్రకటించేసారోచ్…

-

ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు వడ్డీరేట్లపై ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఈ రోజు శ్రీనగర్ లో జరిగిన ట్రస్టీల బోర్డు మీటింగులో వడ్డీరేటుని నిర్ణయించేసారు. గత కొన్ని రోజులుగా వడ్డీ రేట్లు తగ్గుతాయని, కరోనా మహమ్మారి సృష్టించిన భీభత్సం కారణంగా గత సంవత్సరం మాదిరి వడ్డీ రేటు ఇవ్వలేరని, అందువల్ల 2020-21సంవత్సరానికి వడ్దీ రేటు తగ్గనుందని అన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం వడ్డీ రేటు గత ఏడాది మాదిరిగానే 8.5గా నిర్ణయించారు.

ఈ మేరకు ట్రస్టీల బోర్డు అధికారికంగా ప్రకటించారు. 2019-20 సంవత్సరానికి ఇచ్చినట్లుగానే ఈ సంవత్సరానికీ వడ్డీ రేట్లలో మార్పు లేకుండా చూసుకున్నారు. 2011-12 నుండి ఇప్పటి వరకు వడ్డీ రేట్లలో మార్పులు చాలా అత్యల్పమే. అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే 8.25 నుండి 8.8శాతం మధ్యలోనే తిరుగుతుంది. ఈ సారి కూడా వీటి మధ్యలోనే ఉంది. కరోనా మహమ్మారి వల్ల వడ్డీ రేట్లు తగ్గుతాయని బాధపడ్డవారు అలాంటి మార్పులేమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news