ఈఎస్‌ఐ స్కీమ్‌: కోవిడ్ 19 వల్ల మరణిస్తే ఇంట్లో వారికి డబ్బులు..!

కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతున్నాయి. దీనితో కాస్త రిలీఫ్ గా వుంది. అయితే కరోనా వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్‌ఐ స్కీమ్‌, ESI scheme)  కార్పొరేషన్ కొత్త స్కీమ్ తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే..

 

cash
cash

కరోనా కష్ట కాలం లో ఉద్యోగులకు ఊరట కలిగించే ప్రకటన ఒకటి చేసింది. కోవిడ్ 19 వల్ల ఈఎస్ఐ స్కీమ్‌ లబ్ధిదారులు మరణిస్తే కుటుంబ సభ్యులకు డబ్బులు వస్తాయని తెలిపింది. దీనితో నిజంగా చాల మందికి రిలీఫ్ గా ఉంటుంది.

ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కమిషనర్ కరోనా వైరస్ వల్ల చనిపోతే వారి కుటుంబ సభ్యులకు కోవిడ్ రిలీఫ్ స్కీమ్ కింద డబ్బులు వస్తాయన్నారు. జూన్ 3 నుంచే ఈ స్కీమ్ అందుబాటు లోకి వచ్చింది.

ఈఎస్‌ఐ స్కీమ్‌ లో ఉన్న వారు కోవిడ్ 19 వల్ల మరణిస్తే.. వారి ఇంట్లో వారికి ప్రతి నెలా డబ్బులు అందుతాయి. భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకు ఉద్యోగి వేతనం లో 90 శాతం చెల్లిస్తారు అని తెలిపారు.