ఈఎస్ఐ స్కాం : ఏసీబీకి దొరకని నాయిని ఫ్యామిలీ, ఈడీకి ఎలా దొరికింది ?

-

హైదరాబాద్ ఈఎస్ఐ స్కాంలో తీగలాగితే డొంక కదులుతోంది. 2019 నుంచి ఈఎస్ఐ స్కామ్ మీద విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యాంటీ కరప్షన్ బ్యూరో మాజీ డైరెక్టర్ సహా 28 మందిని అరెస్టు చేసింది. అయితే అప్పట్లో ఏసీబీ విచారణలో లేని మాజీ మంత్రి నాయిని కుటుంబీకుల పేర్లు ఇప్పుడు ఎలా వచ్చాయి అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో కేవలం ఐఎంఎస్ సిబ్బంది మాత్రమే స్కామ్ కు పాల్పడినట్లు తేల్చిన ఏసీబీ మనీలాండరింగ్ జరిగిందని మాత్రం ఈడికి లేఖ రాసింది.

ఏసీబీ రాసిన లేఖ తో రంగంలోకి దిగిన ఈడీ ఈ స్కామ్ లో నాయని కుటుంబీకులు సహా అప్పటి మంత్రి పేషీ హస్తం కూడా ఉందని గుర్తించింది. తాజాగా  జరిగిన సోదాల్లో నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, నాయిని పీఎ ముకుంద రెడ్డి ఇళ్ళలో మూడు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంది. ముకుంద రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దేవికారాణి, శ్రీ హరి బాబు బ్యాంకు ఖాతాలు, ఆస్తులపై కూడా ఈడీ ఇప్పుడు దృష్టి పెట్టింది. ఇప్పటికే విచారణకు హాజరు కావాలని వారికి నోటీసులు అందాయి. ప్రస్తుతానికి నాయని నరసింహా రెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి పరారీలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news