రూ.50, రూ.200 ఫేక్ నోట్లు వ‌స్తున్నాయి.. జాగ్ర‌త్త‌.. ఇలా గుర్తించండి..!

Join Our Community
follow manalokam on social media

దేశంలో న‌కిలీ నోట్లు మ‌ళ్లీ విప‌రీతంగా చెలామ‌ణీ అవుతున్నాయ‌ని, ప్ర‌జ‌లు వాటి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. గ‌తంలో దుండుగులు అత్య‌ధిక విలువ క‌లిగిన నోట్ల‌కే న‌కిలీ నోట్ల‌ను సృష్టించేవారు. కానీ వాటిని ప‌ట్టుకుంటున్నార‌ని తెలిసి వారు రూటు మార్చారు. త‌క్కువ విలువ క‌లిగిన నోట్ల‌కు వారు న‌కిలీ నోట్ల‌ను త‌యారు చేసి చెలామ‌ణీ చేస్తున్నార‌ని ఆర్‌బీఐ తెలియ‌జేసింది. రూ.50, రూ.200 నోట్లకు గాను పెద్ద సంఖ్య‌లో న‌కిలీ నోట్లు చెలామ‌ణీ అవుతున్నాయ‌ని, క‌నుక ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది.

fake rs 50 and rs 200 notes circulating beware says rbi

న‌కిలీ నోట్ల‌ను గుర్తించేందుకు ఈ సూచ‌నలు పాటించాలి.

1. నోటును ప‌ట్టుకుని ఎదురుగా పెట్టి చూస్తే నోటు గుండా రూ.50 అంకె క‌నిపిస్తుంది.
2. దేవ‌నాగ‌రి లిపిలో ५० అని నోట్ల‌పై రాసి ఉంటుంది.
3. మ‌హాత్మా గాంధీ బొమ్మ మ‌ధ్య‌లో ఉంటుంది.
4. ‘RBI’, ‘भारत’, ‘INDIA’ and ‘50’ అనే అక్ష‌రాలు చాలా చిన్న‌గా క‌నిపిస్తాయి.
5. సెక్యూరిటీ థ్రెడ్‌పై ‘भारत’ and RBI అనే అక్ష‌రాలు క‌నిపిస్తాయి.
6. గ్యారంటీ క్లాజ్‌, గ‌వ‌ర్న‌ర్ సంత‌కం, ప్రామిస్ క్లాజ్‌, ఆర్‌బీఐ చిహ్నంలు మ‌హాత్మా గాంధీ బొమ్మ‌కు కుడి వైపున క‌నిపిస్తాయి.
7. కుడి వైపున అశోక స్థూపం చిహ్నం ఉంటుంది.
8. మ‌హాత్మా గాంధీ బొమ్మ‌, ఎల‌క్ట్రోటైప్ (50) వాట‌ర్ మార్క్స్ ఉంటాయి.
9. టాప్ లెఫ్ట్ సైడ్‌, బాటమ్ రైట్ సైడ్‌ల‌లో నంబ‌ర్ ప్యానెల్ ఉంటుంది. దానిపై నంబ‌ర్లు చిన్న సైజు నుంచి పెద్ద సైజుకు వెళ్తూ క‌నిపిస్తాయి.
10. ఎడ‌మ భాగంలో నోటును ప్రింట్ చేసిన సంవ‌త్స‌రం ఉంటుంది.
11. స్వ‌చ్ఛ భార‌త్ లోగో, స్లోగ‌న్ ఉంటాయి.
12. లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది.
13. హంపి బొమ్మ‌, ర‌థం ఉంటాయి.
14. దేవ‌నాగ‌రి లిపిలో ५० అని క‌నిపిస్తుంది.

న‌కిలీ నోట్లు చెలామ‌ణీ అవుతున్నాయి క‌నుక పైన తెలిపిన సూచ‌న‌ల‌ను గుర్తుంచుకుంటే త‌ద్వారా న‌కిలీ నోట్ల బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌చ్చు.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...