మీ ఆధార్ కార్డుతో ఎవరైనా సిమ్ కార్డుని వాడుతున్నారా లేదో ఇలా తెలుసుకోండి..!

-

ఫోన్ లో సిమ్ కార్డు లేకపోతే ఫోన్ మాట్లాడడం అవ్వదు. సిమ్ కార్డు ఫోన్ లో తప్పక ఉండాలి. అయితే చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డుని ఉపయోగిస్తూ వుంటారు. అయితే మీ సిమ్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ కార్డు ని ప్రూఫ్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీ ఆధార్ కార్డు పై ఎన్ని సిమ్ కార్డులు వున్నాయి అనేది మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇప్పుడే దీని కోసం పూర్తిగా చూసేయండి.

 

JOBS IN AADHAR CENTER

మనకి ఆధార్ కార్డు ఎన్నో రకాలుగా ఉపయోగ పడుతుంది. ఆధార్ కార్డు ప్రభుత్వ స్కీమ్స్ ని పొందడానికి మొదలు ఎన్నో వాటికీ అవసరం. అలానే ఇది సిమ్ కార్డు పొందాలంటే కూడా అవసరరం. ఆధార్ కార్డు ఉంటే చాలు సింపుల్‌గా సిమ్ కార్డు తీసుకోవచ్చు. అయితే మీ ఆధార్ తో ఎన్ని సిమ్స్ వున్నాయి అనేది తెలుసుకోవాలంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఎన్ని సిమ్స్ మీ పేరుపై ఉన్నాయనేది తెలుస్తుంది.

అయితే దీనిని తెలుసుకోవడానికి మీరు ఎక్కడకి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో వుండే ఈజీగా మీరు దీనిని చూసేయచ్చు. దీని కోసం మీరు ముందుగా https://tafcop.dgtelecom.gov.in/ లింక్ ఓపెన్ చెయ్యాలి. ఇలా ఈ ప్రాసెస్ ద్వారా ఆధార్ నెంబర్‌ పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకో వచ్చు. మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్ కోసం వారి పేరు పై తొమ్మిది సిమ్ కార్డులు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news