మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఏ బ్యాంక్ లో తక్కువ వడ్డీకే రుణం పొందొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. గోల్డ్ లోన్ తీసుకోవడం పెద్ద కష్టం ఏం కాదు. చాలా ఈజీగా లోన్ పొందొచ్చు.
చాల ఈజీగా బ్యాంకులు ఇప్పుడు రుణాలు అందిస్తున్నాయి. బంగారం తీసుకుని బ్యాంక్ కి వెళితే కేవలం 2 గంటల్లోనే మీకు బ్యాంక్ లోన్ తీసుకో వచ్చు. దీని కోసం మరిన్ని వివరాల లోకి వెళితే… గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఒక గుర్తు పెట్టుకోవాలి. ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీకే రుణం లభిస్తుందో తెలుసుకోవాలి.
మరి దాని కోసం కూడా చూస్తే.. తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ అందించే బ్యాంక్‌కు వెళ్లి లోన్ తీసుకుంటే మంచిది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో SBI గోల్డ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 7.35 శాతంగా ఉంది.
అదే కనుక పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అయితే వడ్డీ రేటు 8.75 శాతంగా వుంది. యూనియన్ బ్యాంక్‌లో 8.2 శాతం వడ్డీ పడుతుంది. యాక్సిస్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 12.5 శాతంగా వుంది. వీటిని గమనించి గోల్డ్ లోన్ తీసుకోవడం మంచిది.