ఢిల్లీకి బయల్దేరిన జగన్

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. ప్రస్తుతం ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో సీఎం ఢిల్లీకి పయనమవ్వనున్నారు. రాత్రికి కేంద్ర మంత్రి అమిత్ షాను కలవనున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఎంపీ రఘురామ వ్యవహారం, పోలవరం, ఇతర అంశాలపై కేంద్ర పెద్దలతో జగన్ చర్చించనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి, రక్షణ మంత్రులు, ఇతరులను కూడా కలిసే అవకాశం ఉంది. సీఎం జగన్ వెంట ఎంపీ,అయోధ్య రామిరెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు ఢిల్లీకి బయలుదేరారు.