SBI: గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి గుడ్ న్యూస్…!

-

మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ గోల్డ్ లోన్‌పై ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తోంది. దీనితో మీకు చౌక వడ్డీకే రుణాలు వస్తాయి. పైగా మీకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కూడా లభిస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళకి మంచి ఆఫర్ ని అందించింది. అందుబాటు వడ్డీ రేట్లకే గోల్డ్ లోన్ తీసుకోవచ్చని పేర్కొంది. తక్కువ వడ్డీ రేట్లు మాత్రమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా దీని ద్వారా మీరు లభిస్తాయి.

గోల్డ్ లోన్స్‌పై 7.5 శాతం వడ్డీని వసూలు చేస్తోంది అని ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. పైగా ఈ బెనిఫిట్స్ లో భాగంగా తక్కువ డాక్యుమెంట్లతోనే గోల్డ్ లోన్ పొందొచ్చని బ్యాంక్ చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు బంగారు రుణాలకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా ఈజీగా క్లియర్ చేసేసుకోవచ్చు. మీరు 1800-11-2211 నెంబర్‌కు కాల్ చేసి మీ ప్రశ్నలు అడగవచ్చు. లేదంటే 7208933143 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.

అదే మెసేజ్ ద్వారా క్లియర్ చేసుకోవాలి అంటే 7208933145 నెంబర్‌కు గోల్డ్ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపండి. రూ.20 వేలు లోన్ నుండి రూ.20 లక్షల వరకు గోల్డ్ లోన్ వస్తుంది. బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి లోన్ కోసం అప్లై చేస్తే ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు యోనో నుండి అప్లై చేస్తే పడదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news