ఉద్యోగులకు శుభవార్త… జీతాలు పెంపు…!

Join Our Community
follow manalokam on social media

ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2021లో భారతీయ కంపెనీలు ఉద్యోగుల జీతాలను ఏకంగా 7.7 శాతం మేర పెంచనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే మనcc లో ఎక్కువగా జీతాలని పెంచడం విశేషం అనే చెప్పాలి. సగటున 7.7 శాతం పెంచనున్నట్టు సర్వే లో తేలింది. అలానే పనితీరు మెరుగ్గా ఉన్న వారి వేతనాలు 1.6 రెట్లు ఎక్కువ ఉండే ఛాన్స్ కూడ ఉన్నట్టు ఈ సర్వే ద్వారా తేలింది. 2020లో కంపెనీలు చెల్లించిన వేతనాల కంటే సగటున ఇది 6.4 శాతం అధికం కావడం గమనార్హం.

మన భారతీయులకి ఏకంగా 7.7 శాతం పెరుగుతుండగా.. జపాన్, అమెరికా, చైనా, జర్మనీ, యూకే లాంటి దేశాల్లో జీతాల పెరుగుదల 3.1 శాతం నుంచి 5.5 శాతం మధ్య ఉండనుంది.ఇక మరిన్ని వివరాల లోకి వెళితే… ఈ-కామర్స్, వెంచర్ క్యాపిటల్ సంస్థలు 10.1 శాతం ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నాయి. అలానే టెక్నాలజీ రంగ సంస్థలు 9.7 శాతం చొప్పున జీతాలని పెంచుతున్నట్టు కూడ తెలుస్తోంది. ఐటీఈఎస్ కంపెనీలు 8.8 శాతం, ఎంటర్‌టైన్మెంట్ అండ్ గేమింగ్ కంపెనీలు 8.1 శాతం, ఫార్మా సంస్థలు 8 శాతం వేతనాలని పెంచే అవకాశం కనపడుతోంది.

ఇది ఇలా ఉండగా ఆర్థిక సంస్థలు 6.5 శాతం చొప్పున, ప్రొఫెషనల్ సర్వీసెస్ 7.9 శాతం చొప్పున వేతనాలు పెంచనున్నారు. దేశంలోని 1200కుపైగా కార్పొరేట్ సంస్థలు, 38 పరిశ్రమల నుంచి ఈ సర్వే వివరాలను సేకరించింది. ఆతిథ్యం, మౌలిక వసతులు, రిటైల్, ఇంజినీరింగ్ సర్వీసులు లాంటి రంగాలు కరోనా కారణంగా దెబ్బతిన్నాయి. ఈ రంగాల సంస్థలు 5.5 శాతం నుంచ 5.8 శాతం మధ్య జీతాలు పెంచే అవకాశం ఉంది. అలానే మరో విషయం ఏమిటంటే జీతాలు పెరిగినా ఉద్యోగుల చేతికి అదే స్థాయిలో రాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని సంస్థల్లో ప్రావిడెంట్ ఫండ్ పెంచే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

 

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....