హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ శుభవార్త.. లోన్ కోసం ఇలా చెయ్యండి…!

-

హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు కొత్త కార్ ని కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి సూపర్ ఆప్షన్ ఒకటి తీసుకు రావడం జరిగింది. అలానే తక్కువ ఈఎంఐ ఆఫర్ అందిస్తోంది. ఇక మరి దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… కొత్త కారుని కొనాలి అని అనుకుంటున్నారా..? డబ్బులు కోసం చూస్తున్నారా…? అయితే ఇక మరేమి ఆలోచించొద్దు.

 

ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సులభంగానే కారు రుణాలు అందిస్తోంది. దీనితో మీరు ఈజీగా కారుని కొనచ్చు. పైగా తక్కువ వడ్డీ రేట్లకే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. మీరు కనుక బ్యాంక్ నుంచి కారు లోన్ తీసుకుంటే రూ.లక్షకు రూ.1,111 ఈఎంఐ పడుతుంది గమనించండి. అయితే గతం లో అయితే ఇది రూ.1,555గా ఉండేది. పైగా ఈ ఋణం పైన జీరో ఫోర్‌క్లోజర్ చార్జీలు ఉంటాయి.

కారు ధరలో 90 శాతం మొత్తాన్ని రుణం కింద పొందొచ్చు. మీరు లోన్ ని 7 ఏళ్ల లోపు చెల్లించొచ్చు. డోర్ స్టెప్ డాక్యుమెంటేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. లోన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఏడాదికి రూ.3 లక్షల జీతం వస్తుండాలి. కనీసం 21 ఏళ్లు ఉండాలి. అలానే రెండేళ్ల జాబ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. కంపెనీలో ఏడాది నుంచి పని చేస్తూ ఉండాలి. ఐడీ, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లు కావాలి. పే స్లిప్స్, బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్, ఫోటోలు ఉంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news