HDFC కస్టమర్స్ కి గుడ్ న్యూస్…!

మీకు హెడీఎఫ్సీ బ్యాంక్ లో ఎకౌంట్ వుందా…? అయితే మీకు మంచి శుభవార్త. బ్యాంక్ కీలక నిరన్యం తీసుకోవడం తో మీకు మంచి లాభాలు రానున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు తీపికబురు అందించింది. కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనితో కస్టమర్స్ కి మంచి లాభాలు రానున్నాయి.

ఇక మీరు ఏటీఎం సెంటర్‌కు వెళ్లాల్సిన పని లేదు. మీ ఇంటి వద్దనే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ ఇంటి వద్దకే ఏటీఎం వస్తుంది అని హెడీఎఫ్సీ అంది. ఇప్పుడు కరోనా వైరస్ అందర్నీ ఇబ్బందుల లోకి నెట్టేస్తోంది. అందుకే బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Image

మొబైల్ ఏటీఎంల ద్వారా కస్టమర్లు క్యాష్ విత్‌డ్రాయెల్, ఏటీఎం పిన్ మార్పు, రీచార్జ్, బిల్లుల చెల్లింపు ఇలా 15 రకాల ట్రాన్సాక్షన్లను నిర్వహించొచ్చని బ్యాంక్ తెలిపింది. 19 పట్టణాల లో మొబైల్ ఏటీఎం సర్వీసులు స్టార్ట్ చేసినట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంది.

ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని బ్యాంక్ వెల్లడించింది. మొబైల్ ఏటీఎంలు ఒక రోజులో పట్టణంలోని 3-4 ప్రాంతాల్లో ఉంటాయి. మీరు అక్కడికి వెళ్లి డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది.