ఎల్‌ఐసీ కస్టమర్స్ కి గుడ్ న్యూస్…!

దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC తమ కస్టమర్స్ కి శుభవార్త చెప్పింది. తాజాగా ఎల్‌ఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఐసీ డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ సంస్థ పేటీఎంతో జతకట్టింది. ఇప్పుడు పేటీఎంను డిజిటల్ పేమెంట్స్ పార్ట్‌నర్‌గా చేయడం జరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో ఇ-పేమెంట్స్ పెరగడాన్ని ఎల్‌ఐసీ గమనించింది. అందుకే డిజిటల్ బాట పడుతోంది.

 

ఇలా చేయడం తో పాలసీదారులకు చెల్లింపులు మరింత ఈజీ అవ్వనున్నాయి. తన కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు పేమెంట్స్ ఎక్కువగా డిజిటలైజ్ కావడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్‌ఐసీ అంది.

పేటీఎం, ఎల్‌ఐసీ భాగస్వామ్యం వద్ద పాలసీదారులు సులభంగానే పేమెంట్ నిర్వహించొచ్చు. అంతే కాకుండా పేమెంట్ ఆప్షన్‌లో పేటీఎం కూడా కనిపిస్తుంది. ఎల్‌ఐసీ కాంట్రాక్ట్ కోసం దాదాపు 17 పేమెంట్ ప్లాట్ ఫామ్ బిడ్లు దాఖలు చేశాయి. అయితే పేటీఎంకు మాత్రమే ఈ అవకాశం వచ్చింది. దీనికి గల కారణం ఏమిటంటే పేటీఎం విస్తృత శ్రేణి చెల్లింపు సేవలు కారణంగా ఎల్‌ఐసీ కాంట్రాక్ట్ లభించింది.