ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..ఆ నిర్ణయంతో భారీ ఊరట..!!

-

జూలై ఒకటో తారీఖు నుంచి బ్యాంక్ రూల్స్ పూర్తిగా మారిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు బ్యాంకులు బ్యాంకులు హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను పెంచుకుంటూ వెళ్తున్నాయి. అయితే ఇక్కడ ఉద్యోగులకు ఒక తీపికబురు ఉంది. ఏంటని ఆలోచిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నిర్మాణం కోసం తీసుకునే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్‌ (హెచ్‌బీఏ)ను తక్కువ వడ్డీ రేటుకే పొందొచ్చు. దీన్ని హోమ్ లోన్ అని కూడా చెప్పుకోవచ్చు.

కేంద్రం అడ్వాన్స్ రూపంలో ఉద్యోగులకు ఈ తరహా సదుపాయం కల్పిస్తోంది. ఇది వరకు ఈ తరహా రుణాలపై వడ్డీ రేటు 7.9 శాతంగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ రేటును 7.1 శాతంగా ఉంది. అంటే వడ్డీ రేటు భారీగానే తగ్గాయి.వడ్డీ రేటు భారీగానే తగ్గిందని చెప్పుకోవచ్చు. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) పెంపు తర్వాత ఉద్యోగులకు అందిన మరో శుభవార్త ఇది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉద్యోగులు నెలవారీ హోమ్ లోన్ ఈఎంఐ తగ్గనుంది. గతంలో కన్నా ఇకపై తక్కువ ఈఎంఐ చెల్లించవచ్చు.

కొత్తగా హెచ్‌బీఏ తీసుకునే వారికి వడ్డీ రేటు తగ్గింపు ప్రయోజనం ఉంటుంది.బిల్డింగ్ అలవెన్స్‌ను హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్‌గా మారుస్తారు.అయితే,ఈ సదుపాయం కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే..గతంలో సెంట్రల్ ఎంప్లాయీస్‌కు కూడా ఈ ఫెసిలిటీ ఉండేది కాదు. అయితే 2020 అక్టోబర్ 1న ఈ ప్రత్యేక స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. హెచ్‌బీఏ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఇంటి నిర్మాణం కోసం తక్కువ వడ్డీ రేటుకు రుణాలు అందిస్తుంది..

పర్మనెంట్ లేదా తాత్కాలిక ఉద్యోగులు ఎవరైనాసరే ఈ ఫెసిలిటీ పొందొచ్చు..అయితే ఆ ఉద్యోగులు 5 ఏళ్లు ఉద్యోగం చేసి ఉండాలి.. అప్పుడే వీళ్లకు తక్కువ వడ్డీకే సొంతింటి కల సాకారం చేసుకోవడానికి రుణం అందిస్తుంది. ఉదాహరణకు ఉద్యోగి తన సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే ప్రభుత్వం నుంచి తక్కువ వడ్డీకే హెచ్‌బీఏ రుణాన్ని పొందవచ్చు..హెచ్‌బీఏ పై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ఈ వడ్డీ రేటు 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మారచి 31 వరకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. గరిష్టంగా రూ. 25 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించేందుకు 5 ఏళ్లు లేదా 60 నెలల టెన్యూర్ ఇస్తారు. ఈఎంఐ రూపంలో ప్రతి నెలా డబ్బులు చెల్లిస్తూ వెళ్లాలి..అప్పుడే మరో రుణం పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version