సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా సంచలన కామెంట్స్..!

-

సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా సంచలన  కామెంట్స్ చేశారు. సిట్ విచారణ మొదట నుంచి మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. స్వలాభం కోసం చంద్రబాబు లడ్డూ కల్తీ అని ప్రకటన చేశారు. సుప్రీం కోర్టు సరిగ్గా విచారణ చేస్తే చంద్రబాబు అబద్ధాలు బయటకు వస్తాయి. సీఎం స్థాయిలో ఉండి విచారణ చేయకుండా, సాక్ష్యాధారాలు లేకుండా లడ్డూ పై ప్రకటనలో చేశారు. జగన్ ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశారు.

సిట్ ను హడావుడిగా ఏర్పాటు చేశారు. ఈ సిట్ పై మాకు నమ్మకం లేదు. ఇది వరకే చంద్రబాబు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో డీఐజీ స్థాయి అధికారితో సిట్ వల్ల నిజాలు బయటకు రావు. సీబీఐకి ఇవ్వాలని మేము కోరుతున్నాము. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఈ విచారణ జరగాలి. లడ్డుని తినాలా వద్దా అని భక్తులు అనుమానంతో ఉన్నారు. లడ్డూ తినకుండా భక్తులు వెళ్ళిపోతుండడం నాకు చాలా బాధ వేసింది. నేను ఇవాళ తమిళనాడు అలఘర్ ఆలయంలో ఉన్నాను. తప్పుడు ప్రకటన చేసిన వారికి శిక్ష పడాలని నేను ఇక్కడ దేవుడుని వేడుకున్నాను.

Read more RELATED
Recommended to you

Exit mobile version