వాస్తు : ఇంట్లో ఈ మార్పులు చేయండి.. ఇక డబ్బే డబ్బు..!

-

వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన జీవితం చాలా బాగుంటుంది. వాస్తు ప్రకారం అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో ఈ మార్పులు చేస్తే అదృష్టం తన్నుకొస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో బీరువా ఉంటుంది. బీరువా లేని ఇల్లు ఉండదు. బీరువాలో బట్టలు, బంగారు నగలు, డబ్బులు ఇలా విలువైనవి దాచిపెట్టుకుంటూ ఉంటాం. ఇంత విలువైనవి దాచిపెట్టుకున్నప్పుడు కచ్చితంగా వాస్తు నియమాలని పాటించాలి కదా..? వాస్తు పండితులు కొన్ని సూచనలు చెప్పారు. వాటి ప్రకారం అనుసరించడం వలన ఆర్థిక ఇబ్బందులే ఉండవు. పైగా డబ్బులు విపరీతంగా వస్తాయట.

బీరువాలో కొన్ని వస్తువుల్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి. అలా చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. బీరువాను ఉత్తర దిశ వైపు మాత్రమే పెట్టాలని పండితులు సూచిస్తున్నారు. ఉత్తరదిక్కు కుబేర స్థానం కావడం వలన ధన వృద్ధి కలుగుతుంది. బీరువాను సరైన ప్రాంతంలో పెట్టడంతో పాటు కొన్ని వస్తువులను ఉంచాలి. డబ్బులు పెట్టుకునే చోట గోవింద నామాల పుస్తకం, లక్ష్మీ అష్టోత్తరము ఉంటే మంచిది.

బీరువాలో నోట్లు, చిల్లర, బంగారం వేరువేరుగా పెట్టుకోవాలి. ఇలా విడివిడిగా దాచిపెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. అలాగే వెండి లేదా రాగి పాత్రలో కర్పూరం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. బీరువాలో ఎరుపు రంగు వస్త్రం ఉంచకూడదు. ఎరుపు రంగు వస్త్రం ఉండటం వలన ధన వృద్ధి ఆగిపోతుంది. సాధ్యమైనంత దాకా తెల్లటి కాటన్ వస్తారని ఉంచాలి. ఈ తెల్లటి వస్త్రం పై అత్తరు రాసి పెడితే మరింత లాభం కలుగుతుంది ప్రతిరోజు బీరువా తెరిచి అగురబత్తీలు వెలిగించి చూపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version