నిరుద్యోగులకు గుడ్ న్యూస్… బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో లో 150 ఉద్యోగాలు…!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 150 ఖాళీలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న బ్రాంచ్‌లల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇక దీనికి సంబంధించి వివరాలని చూస్తే.. 2021 ఏప్రిల్ 6 లోగా దరఖాస్తు చేయాలి. మొత్తం ఖాళీలు 150 వున్నాయి.

ఇక పోస్టులు వివరాలు అయితే ఎస్‌సీ- 22, ఎస్‌టీ- 11, ఓబీసీ- 40, ఈడబ్ల్యూఎస్- 15, అన్‌రిజర్వ్‌డ్- 62 వున్నాయి. అర్హత, ఆసక్తి ఉంటే అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్ఏ, ఎఫ్ఆర్ఎం లాంటి కోర్సులు పాస్ అయినవారికి ప్రాధాన్యం ఉంటుంది.

ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో మూడేళ్లు ఆఫీసర్‌గా పని చేసిన అనుభవం ఉండాలి. వయస్సు అయితే 25 నుంచి 35 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు లోకి వెళితే అన్‌రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,180. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు రూ.118 చెల్లించాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

https://www.bankofmaharashtra.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు ఇదే వెబ్‌సైట్ ‌లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. రూ.48,710+అలవెన్సులు ఉంటుంది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news