ఈ మధ్య కాలంలో డిజిటిల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే మొదలైన యాప్స్ నుండి చాలా మంది ట్రాన్సక్షన్స్ చేస్తున్నారు. అయితే ప్రముఖ పేమెంట్ సంస్థ గూగుల్ పే మరో కొత్త ఫీచర్ను ప్రకటించింది. ఇక దానికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
‘ గూగుల్ ఫర్ ఇండియా 2021’ విజన్లో భాగంగా దీనిని తీసుకు రావడం జరిగింది. మాములుగా ఇప్పుడైతే యూపీఐ నంబర్ ఎంటర్ చేసి సెండ్ కొడితే చాలు అవతలి వ్యక్తి ఖాతాలోకి డబ్బులు వెళ్తాయి. కానీ దీనిని ఇప్పుడు మరెంత ఈజీ చేసారు.
అడ్వాన్స్డ్గా వాయిస్ బేస్డ్ మనీ ట్రాన్స్ఫర్ ఆప్షన్పై గూగుల్ పే పనిచేస్తోంది. దీనితో మనం వాయిస్ కమాండ్ ఇస్తే సరిపోతుంది. డబ్బులు కూడా సెండ్ అవుతాయి. ఇంగ్లిష్, హిందీ రెండు భాషలకు మద్దతిస్తుంది. బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళం, తెలుగు వంటి భాషల్లోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
అదే విధంగా చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని గూగుల్ పే ‘మై షాప్’ ఫీచర్ని కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 10 మిలియన్ల వ్యాపారులు గూగుల్ పేని ఉపయోగిస్తున్నారు. గూగుల్ పే లో వ్యాపారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇటువంటి సమయంలో కొత్తగా లాంచ్ అవుతోన్న మై షాప్ ఫీచర్ చిరు వ్యాపారులకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది.