జూన్‌ 1 తర్వాత ఇది లేకుండా బంగారం అమ్మరాదు.. కొనరాదు!

-

గోల్డ్‌ కొనుగోలు, అమ్మకానికి సంబంధించి మోడీ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువస్తోంది. దీంతో బంగారు దుకాణాల్లో గోల్డ్‌ హాల్‌ మార్కింగ్‌ లేని ఆభరణాలను విక్రయించడానికి వీలు ఉండదు. ఈ విషయం తెలుసుకుని జాగ్రత్త పడండి. గోల్డ్‌ కొనే వారికి ప్రయోజనం కలిగించేలా ఈ కొత్త నిబంధనలు ఉండనున్నాయి. మోడీ సర్కార్‌ 2021 జూన్‌ 1 నుంచి గోల్డ్‌ హాల్‌ మార్కింగ్‌ నిబంధనలను అమలులోకి తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో బంగారం కొనే వారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొనుగోలు దారులకు ప్రయోజనం కలిగించాలనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

బంగారంపై హాల్‌ మార్కింగ్‌ నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత జువెలర్స్‌ కచ్చితంగా వారి వద్ద ఉన్న ఆభరణాలను బీఐఎస్‌ వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్‌ చేసిన బంగారు నగలనే వినియోగదారులకు విక్రయించాల్సి ఉంటుంది. హాల్‌ మార్క్‌ లేని ఆభరణాలు విక్రయిస్తే వారికి భారీ జరిమానా విధించనుంది. అయిన వారి వైఖరి మారకుండా, హాల్‌ మార్కింగ్‌ రిజిస్ట్రర్‌ చేయించుకోక పోతే వారు ఇంకా జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు. సాధారణంగా బంగారానికి మూడు నాణ్యతా ప్రమాణాలు కేటాయిస్తారు. 14 క్యారెట్ల,18 క్యారెట్ల , 22 క్యారెట్ల బంగారం . బీఐఎస్‌ గోల్డ్‌ నాణ్యత ఎంత అనే అంశాన్ని నిర్ణయించి హాల్‌ మార్కింగ్‌ వేస్తుంది. ఇలా హాల్‌ మార్క్‌ ఉన్న నగలనే వినియోగదారులు కొనాలి. అప్పుడు మీరు కొన్న బంగారం ఎంత స్వచ్ఛమైందో మీకు కరెక్ట్‌గా తెలుస్తుంది. ఇది బంగారం స్వచ్ఛతకు సర్టిఫికేషన్‌ లాంటిది.

బంగారు ఆభరణాల సంస్థలు ఆభరణాల హాల్‌ మార్కింగ్‌ కోసం ముందుగా ఆన్‌ లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. www.manakonline.in  వెబ్‌సైట్‌లో హాల్‌ మార్కింగ్‌ రిజిస్ట్రేషన్‌కు ముందుగా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఇకపోతే దీనికి కొంత నామినల్‌ ఫీజు వసూలు చేస్తారు.ఈ ఛార్జీలు జువెలరీ సంస్థ టర్నోవర్‌ ప్రాతిపదికన చెల్లించాల్సిన ఫీజు కూడా మారుతుంది. ఇది రూ.7,500 నుంచి ప్రారంభమవుతుంది. రిజిస్టర్డ్‌ జువెలరీ సంస్థలు బీఐఎస్‌ గుర్తింపు పొందిన ఏ అండ్‌ హెచ్‌ సెంటర్‌కు హాల్‌ మార్కింగ్‌ కోసం ఆభరణాలు పంపాల్సి ఉంటుంది. అప్పుడు పూర్తిగా బంగారం స్వచ్చతకు సర్టిఫికేషన్‌ పూర్తయినట్లు. మీరు కూడా బంగారం కొనే ముందు హాల్‌ మార్కింగ్‌ ఉంటేనే కొనండి.

Read more RELATED
Recommended to you

Latest news