ఎక్కువ క్రెడిట్ కార్డు ఉన్నాయా..?అయితే ఇవి తప్పక తెలుసుకోవాలి..!

-

ఈ మధ్య కాలంలో క్యాష్ పేమెంట్స్ కంటే డిజిటల్ పేమెంట్స్ ఎక్కువైపోయాయి. అలానే క్రెడిట్ కార్డ్స్ ని కూడా ఎక్కువ మంది వాడుతున్నారు. క్రెడిట్ కార్డు వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి కనుక ఎక్కువ మంది వీటిని వాడడం జరుగుతోంది. అయితే కొందరు అయితే ఏకంగా ఒకటి కంటే ఎక్కువ కార్డ్స్ ని వాడుతున్నారు. మీరు కూడా అలానే చేస్తున్నారా..? అయితే తప్పక ఈ విషయాలని తెలుసుకోండి.

క్రెడిట్ కార్డు తో షాపింగ్ చేస్తే రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్ వంటివి లభిస్తాయి. అన్ని కార్డ్స్ కి అవి ఒకేలా వుండవు. కనుక వాటిని గమనించి కొనుగోలు చెయ్యండి.

అలానే క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్‌కు, డ్యూడేట్‌కు మధ్య ఉన్న కాలానికి ఎలాంటి వడ్డీ పడదు. దీన్ని ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అని చెప్పుకుంటారు. ఏటీఎం ట్రాన్సాక్షన్లు మినహా మరే ఇతర ట్రాన్సాక్షన్లకు ఈ కాలంలో వడ్డీ పడదు. కనుక టైం ని గమనించండి.

అలానే ఈఎంఐ విషయాలని కూడా పూర్తిగా గమనించాలి. ఇది కూడా చాలా ముఖ్యం.

చాలా కార్డులు ఉండటం వల్ల చాలా లిమిట్ అందుబాటులో ఉంటుంది. ఏది ఏమైనా రీపేమెంట్ కెపాసిటీకి మించి ఖర్చు చేయొద్దు.

అదే విధంగా క్రెడిట్ కార్డు డ్యూ డేట్‌ను కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఎక్కువ కార్డ్స్ ఉండడం వలన మర్చిపోతూ వుంటారు కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news