ఈ క్రెడిట్ కార్డుని వాడుతున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్..!

చాలా మంది క్రెడిట్ కార్డ్స్ ని వాడతారు. అత్యవసర పరిస్థితిలో క్రెడిట్ కార్డు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ క్రెడిట్ కార్డ్స్ ని ఉపయోగించే వాళ్ళు అదిరే లాభాలు పొందొచ్చు. మరి ఇక ఆ క్రెడిట్ కార్డ్స్ గురించి, వాటి వలన కలిగే లాభాల గురించి ఇప్పుడే చూసేద్దాం.

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వుందా..? లేదు అంటే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు కానీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కానీ ఉందా అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్స్ లో ఏ క్రెడిట్ కార్డు ఉన్నా కూడా తగ్గింపు ఆఫర్లు పొందొచ్చు. ఇక మరి ఎలాంటి ఆఫర్స్ పొందుచు అనేది చూస్తే.. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై రూ.5 వేల వరకు తగ్గింపు వస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ వెబ్‌సైట్లలో ఈ ఆఫర్ పొందొచ్చు.

అలానే ఎంఐ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కూడా తగ్గింపు పొందొచ్చచు. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఎంఐ 11 అల్ట్రా ఫోన్‌పై గరిష్టంగా రూ.5 వేల తగ్గింపు వస్తుంది. అదే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.3 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఎంఐ టీవీ 5ఎక్స్ సిరీస్ కొనుగోలుపై ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌లో వుంది. అలాగే రెడ్‌మి నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫోన్ కొనుగోలుపై కూడా రూ.1500 వరకు తగ్గుతుంది. ఇది అమెజాన్ లో వుంది. అదే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో శాంసంగ్ గ్యాలక్సీ ఫోన్ కొనుగోలు చేస్తే తగ్గింపు వస్తుంది. గ్యాలక్సీ ఎం32 5జీ ఫోన్‌పై ఆఫర్ ఉంది. రూ.2 వేల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.