మొదట కోవ్యాగ్జిన్‌.. రెండో డోసులో కొవిషీల్డ్‌ టీకాలు తీసుకోవచ్చా?

కరోనా వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేసుకోవాల్సిన్‌ ఈ సందర్భంగా ప్రజలకు చాలా మందికి వ్యాక్సిన్‌పై ప్రశ్నలు మొదలవుతున్నాయి. అదే ముందుగా కోవాగ్జిన్‌ తీసుకుంటే ఆ తర్వాత రెండో డోస్‌లో కోవిషీల్డ్‌ టీకా తీసుకోవాచ్చా? టీకా తీసుకున్నాకా మద్యం సేవించవచ్చా? ఇరత రుగ్మతలకు సంబంధించిన మందులు వాడచ్చా? ఇలా అనేక రకాల సందేహాలు వస్తున్నాయి. అయితే,
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లలో ఏదైనా మంచి ఫలితం ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీకాలపై నెలకొన్న అపోహలు, వాటికి సమాధానాలు తెలుసుకుందాం.

  • కోవ్యాగ్జిన్, కొవిషీల్డ్‌లలో ఏ వ్యాక్సిన్‌ మంచిది?

దేశంలో ఈ రెండు వ్యాక్సిన్లను అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఏదో ఒక వ్యాక్సిన్‌ ను ఎంచుకునే అవకాశం లేదు. ఇవి రెండూ కరోనా వైరస్‌పై సమర్థవంతంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది.

  • మొదటి డోసు ఒక టీకా, రెండో డోసు మరో టీకా తీసుకోవచ్చా?

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లను వేర్వేరు పద్ధతుల్లో డెవలప్‌ చేశారు.కోవాగ్జిన్‌ ఒక ఇన్‌ యాక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌. కొవిషీల్డ్‌ వైరల్‌ వెక్టార్‌ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంది. అందువల్ల రెండు టీకాలను కలిపి తీసుకోవద్దు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి రెండు డోసుల్లోనూ ఏదో ఒక వ్యాక్సిన్‌ మాత్రమే తీసుకోవాలి .

  • రెండో డోసు తీసుకునే వరకు ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలా?

ఎప్పుడూ తీసుకునే ఆహారాన్ని కొనసాగించాలి. ఆహారం విషయంలో ప్రత్యేక డైట్‌ పాటించాల్సిన అవసరం లేదు.

  • గర్భిణులు, పిల్లలు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా?

కరోనా గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. రెండో దశలో మహమ్మారి పిల్లలకు కూడా వ్యాపిస్తోంది. కానీ మన దేశంలో ఉపయోగిస్తున్న రెండు వ్యాక్సిన్ల క్లినికల్‌ ట్రయల్స్‌ను గర్భిణులు, పిల్లలపై నిర్వహించలేదు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ గర్భిణులకు, పిల్లలకు వ్యాక్సిన్లను సిఫారసు చేయలేదు.

  • టీకాల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి?

వ్యాధుల నివారణకు తీసుకునే అన్ని రకాల టీకాలు కొద్దిపాటి దుష్ప్రభావాలు కలిగిస్తాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత కూడా కొంతమందికి ఒళ్లు నొప్పులు, తేలికపాటి జ్వరం, అలసట, తలనొప్పి, కీళ్ల నొప్పులు, అలసట వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ కొన్ని గంటల్లోనే తగ్గిపోతాయి.

  • టీకాల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయా?

సాధారణంగా వ్యాధుల నివారణకు తీసుకునే అన్ని రకాల టీకాలు కొద్దిపాటి దుష్ప్రభావాలు కలిగిస్తాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత కూడా కొంతమందికి ఒళ్లు నొప్పులు, తేలికపాటి జ్వరం, అలసట, తలనొప్పి ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కొన్ని గంటల్లోనే తగ్గిపోతాయి. అందువల్ల దుష్ప్రభావాలకు భయపడకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి.

  • వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ఒక రోజు ముందు, ఆ తరువాత ఆల్కహాల్‌ తీసుకోవచ్చా?

ఆల్కహాల్‌ రోగనిరోధక వ్యవస్థపై ఎంతో కొంత ప్రతికూల ప్రభావం చూపుతుంది. వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత మితంగా మద్యం తీసుకోవడం వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ దుష్ప్రభావాలు ఎదురవ్వకుండా జాగ్రత్తపడటానికి వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు, మూడు రోజుల వరకు మద్యపానానికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

  • ఇతర వ్యాధులకు మందులు వాడేవారు వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడు మెడిసిన్‌ ఆపేయాలా?

ఇతర మందులు ఎలాంటి ప్రభావం చూపవు. వేరే వ్యాధులకు మందులు వాడేవారు వ్యాక్సినేషన్‌ అనంతరం కూడా వాటిని కొనసాగించవచ్చు.