పీఎఫ్‌ ఖాతాలో వడ్డీ చూసుకోండిలా..

-

మ‌న‌ దేశంలోని కొన్ని ల‌క్ష‌ల మంది ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల‌ను ఉద్యోగుల భ‌విష్య నిధి సంస్థ‌(ఈపీఎప్ఓ) నిర్వ‌హిస్తుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ‘ఈపీఎప్ఓ ’ చందాదారుల ఖాతాల్లో త్వరలోనే వడ్డీ సొమ్ము జమకానుంది. గత ఆర్థిక సంవత్సరానికి(2018-19) గాను 6 కోట్లకు పైగా పీఎఫ్‌ చందాదారులకు తమ ఖాతాలోని సొమ్ముపై 8.65 శాతం వార్షిక వడ్డీ లభించనుంది. అకౌంట్లో వడ్డీ సొమ్ము జమైందో లేదో మీరు తెలుసుకోవచ్చు. ఎలాగంటే..

ఉమంగ్‌ యాప్‌:

– ఈపీఎఫ్‌ఓ ఉమంగ్‌ అనే మొబైల్‌ అప్లికేషన్‌ (యాప్‌) ద్వారా ఖాతాలో సొమ్ము వివరాలతోపాటు పలు సేవలందిస్తోంది. మీ స్మార్ట్‌ఫోన్‌లోని ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి ఉమంగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.

– ఉమంగ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి ఈపీఎ్‌ఫఓను ఎంచుకోండి. ‘ఎంప్లాయీ సెంట్రిక్‌ సర్వీసెస్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

– మీ ఖాతాలో బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకునేందుకు ‘వ్యూ పాస్‌బుక్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయండి. మీ యూఏఎన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి ‘గెట్‌ ఓటీపీ’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

– మీ మొబైల్‌ నంబరుకు ఈపీఎ్‌ఫఓ నుంచి వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేశాక లాగిన్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. పీఎఫ్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోదలిచే కంపెనీ మెంబర్‌ ఐడీని ఎంచుకోవాలి.

– తద్వారా పాస్‌బుక్‌ను యాక్సెస్‌ చేయడంతోపాటు పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు. అయితే, యూఏఎన్‌ యాక్టివేట్‌ అయి ఉండి, యూఏఎన్‌ మెంబర్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు మాత్రమే ఈ సేవలను పొందగలరు.

ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌:
– www.epfindia.gov.in సైట్‌లోకి లాగిన్‌ అవండి హోమ్‌ పేజ్‌లో ఎడమవైపు మూలన ఉన్న ‘అవర్‌ సర్వీసెస్‌’ టాబ్‌లో ‘ఫర్‌ ఎంప్లాయిస్‌’ ఆప్షన్‌ను ఎంచుకోండి.

– మెంబర్‌ పాస్‌బుక్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. మీ యూఏఎన్‌ నంబరు, పాస్‌వర్డ్‌తో లాగిన్‌కండి.

– తద్వారా పీఎఫ్‌ అకౌంట్‌ను యాక్సెస్‌ చేయడంతోపాటు ఖాతాలో అప్పటివరకు ఎంత సొమ్ము జమైందో తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news