సాధారణంగా మన దేశం లో ట్రైన్స్ ఆలస్యంగా వస్తూనే ఉంటాయి. సరిగ్గా సమయానికి వచ్చింది అంటే అది గొప్ప విషయమే. నిజంగా రైళ్లు ఆలస్యంగా రావడం వలన ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇప్పుడు ట్రైన్ ఆలస్యమైతే టికెట్ డబ్బులు వెనక్కి పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
కొన్ని కొన్ని సార్లు రైలు మరీ ఆలస్యంగా వస్తుంది అంటే ప్రయాణం చెయ్యకూడదని నిర్ణయించుకుంటాం. అలా కనుక మీరు భావించారు అంటే మీ టికెట్ డబ్బులు వెనక్కి పొందొచ్చు. దీని కోసం టీడీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే ట్రైన్ 3 గంటలకు మించి ఆలస్యం అయితేనే ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకొని పూర్తి డబ్బులు తిరిగి మీరు పొందొచ్చు. అయితే గతం లో అయితే కౌంటర్ టికెట్లకు మాత్రమే ఈ అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఈ అవకాశం ఆన్‌లైన్ టికెట్లకు కూడా వర్తిస్తోంది.
కనుక రైలు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయ్యి.. ప్రయాణం చేయకూడదు అని భావిస్తే.. ఈ ఫెసిలిటీ ద్వారా ప్రయాణికులకు వారి డబ్బులు వెనక్కి వస్తాయి. దీని కోసం టీడీఆర్ దాఖలు చేయాలని అనుకుంటే.. ముందు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత మై అకౌంట్ సెక్షన్‌లోకి వెళ్లి మై ట్రాన్సాక్షన్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ అప్లై చెయ్యాలి. మ్యాక్సిమమ్
అరవై రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి.