పీఎఫ్ ఖాతాదారులు ఇలా చేస్తే అకౌంట్ పని చేయదట..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ అకౌంట్ కు సంబంధించిన సేవలని అందిస్తుంది. ఈ పీఎఫ్ అకౌంట్ అనేది దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం చేసే ఉద్యోగులకు ఉంటుంది. ఉద్యోగుల శాలరీలో కొంత అమౌంట్ అనేది పీఎఫ్ ఖాతాలోకి వెళుతుంది.

epf

బేసిక్ శాలరీ, డీఏలో ఏకంగా 12 శాతం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో పడుతుంది. అయితే పీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్ళకి కచ్చితంగా వాటి యొక్క రూల్స్ గురించి తెలియాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… పీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్ళకి కచ్చితంగా వాటి యొక్క రూల్స్ అనేవి తెలియాలి.

లేదంటే చిక్కుల్లో పడతారు. ఉద్యోగి జాబ్ మారిన సమయంలో కొత్త కంపెనీకి పాత పీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవాలి. పీఎఫ్ అకౌంట్ వున్నా వాళ్ళు ముఖ్యంగా ఈ ఒక్క విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలి. మూడు సంవత్సరాల పాటు పీఎఫ్ అకౌంట్ లో ఎటువంటి లావాదేవీలు జరగని పక్షంలో పీఎఫ్ అకౌంట్ ఇన్ యాక్టివ్ అయ్యి పోయే అవకాశం ఉంటుంది.

పీఎఫ్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు మరణించినా కూడా ఇన్ యాక్టివ్ అయ్యి పోయే అవకాశం ఉంటుంది. అలానే ఒకవేళ కనుక ఇతర దేశాలకు వెళ్లినా ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది. అలానే మరో ముఖ్యమైన విషయాన్నీ తెలుసుకోవాలి.

అదేమిటంటే పీఎఫ్ ఖాతాలోని డబ్బులకు ఏడేళ్లలో ఎలాంటి క్లెయిమ్ రాకపోతే ఆ మొత్తం సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ ఫండ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఉద్యోగులు పీఎఫ్ ఖాతా నుంచి మొత్తం డబ్బులను విత్ డ్రా చేసుకున్నా కూడా ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది. అలానే నామినీ వివరాలని కూడా ఎంటర్ చెయ్యాలి. లేదంటే కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news