ఇలా చేస్తే కరోనా టైమ్‌లోనూ మంచి లాభం…!

మీరు ఈ కష్ట సమయంలో కూడా అదిరిపోయే రాబడి పొందాలని అనుకుంటున్నారా…? అయితే మీరు ఇప్పుడే దీని కోసం తెలుసుకోండి. మరి దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ప్రభుత్వ రంగానికి చెందిన స్టీల్ తయారీ కంపెనీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఈ సమయం లో దూసుకెళుతోంది అనే చెప్పాలి.

నిజంగా దీని వలన మంచి ప్రాఫిట్స్ వస్తాయి. గత ఆరు వారాల్లో షేరు ధర ఏకంగా 85 శాతం పైకి కదిలింది. నెలన్నర కిందట సెయిల్ షేర్లలో రూ.లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడు చేతికి రూ.1.85 లక్షలు వచ్చేవి.

దీని వలన ఇప్పుడు కూడా భారీ లాభాలను వస్తున్నాయి. సెయిల్ మార్కెట్ క్యాప్ రూ.50 వేల కోట్ల మార్క్‌ను దాటేసింది. అయితే కేవలం నలభై ఐదు రోజుల లోనే షేర్ ధర ఎక్కవగా పెరిగింది. ఏకంగా 80 శాతం ర్యాలీ చేసింది. సెయిల్ కంపెనీ భారత్‌లోని 100 మోస్ట్ వ్యాల్యుబుల్ కంపెనీల జాబితాలో స్థానం సంపాదించుకుంది.

దీంతో సెయిల్ స్టాక్ ఇప్పుడు దూసుకెళుతోంది. అయితే వీటికి కారణం మార్చి త్రైమాసికం లో అదిరిపోయే రాబడి అంచనాలు, భవిష్యత్ వృద్ధి అంచనాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకో వచ్చు. ఇది ఇలా ఉండగా సెయిల్ షేరు ధర మంగళవారం ట్రేడింగ్‌ లో 52 వారాల గరిష్టాన్ని తాకింది.

దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.55 వేల కోట్ల పైకి ఎగసింది. అలానే ఇది పెరగొచ్చు అని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.