ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోనేవాళ్ళు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి..!!

-

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటున్నారు.మనం కాకపోయినా,మన తర్వాత వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ ను తప్పక తీసుకుంటున్నారు.ఎంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే అంత ఎక్కువ రాబడి పొందొచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్ సాధనాల విషయానికి వస్తే.. ముందుగా గుర్తుకు వచ్చేది ఇన్సూరెన్స్. ఉత్తమమైన ఆర్థిక సాధనాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవాలి. ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన మనపై ఆధారపడ్డ వారికి ఆర్థిక భద్రత లభిస్తుంది.
ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడం చాలా సులభం. దాదాపు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అదనపు బెనిఫిట్స్, కవరేజ్ వంటివి అందిస్తున్నాయి. అయితే ఎక్కువ ఆప్షన్లు అందుబాటులో ఉండటం వల్ల గందరగోళం తలెత్తే అవకాశం ఉంటుంది.ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడానికి ముందు గుర్తించుకోవాల్సిన అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

20 ఏళ్ల వయసులో పెళ్లి కోసం కావొచ్చు.. 60 ఏళ్ల వయసులో అదనపు ఆదాయం కోసం కావొచ్చు.. పాలసీ మీ అవసరాలను తీర్చగలగాలి. అంతేకాకుండా ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. మీ లక్ష్యం ఏంటో మీకు స్పష్టంగా తెలియాలి. అప్పుడే మీరు దాన్ని సాకారం చేసుకోగలరు. ఉదాహరణకు మీరు మీ పిల్లలను పదేళ్ల తర్వాత ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్కు పంపాలని అనుకుంటే.. ఇప్పుడు దీని కోసం రూ. 22 లక్షలు ఖర్చు అవుతుంటే, 10 ఏళ్ల తర్వాత రూ. 43.27 లక్షలు కావాల్సి ఉంటుంది..

ఈ ఇన్సూరెన్స్ పాలసీని 20 ఏళ్ల వయసులో పెళ్లి కోసం కావొచ్చు..60 ఏళ్ల వయసులో అదనపు ఆదాయం కోసం కావొచ్చు.. పాలసీ మీ అవసరాలను తీర్చగలగాలి. అంతేకాకుండా ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. మీ లక్ష్యం ఏంటో మీకు స్పష్టంగా తెలియాలి. అప్పుడే మీరు దాన్ని సాకారం చేసుకోగలరు. ఉదాహరణకు మీరు మీ పిల్లలను పదేళ్ల తర్వాత ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్కు పంపాలని అనుకుంటే.. ఇప్పుడు దీని కోసం రూ. 22 లక్షలు ఖర్చు అవుతుంటే, 10 ఏళ్ల తర్వాత రూ. 43.27 లక్షలు కావాల్సి ఉంటుంది.
ఎంత డబ్బులు పెట్టాలి..అనే విషయాన్ని మీరు ముందుగానే డిసైడ్ చేసుకోవాలి.మీ వయసు, మీపై ఆధారపడిన వాళ్లు, మీ ఆర్థిక పరమైన బాధ్యతలు, మీ ఖర్చులు, రుణాలు వంటి అంశాలు మీరు చెల్లించగలిగే ప్రీమియం సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. మీ జేబుకు ఇబ్బంది లేకుండా ప్రీమియం చెల్లింపు ఉండేలా చూసుకోండి. మీ కుటుంబపు భవిష్యత్ ఆర్థిక అవసరాలను తీర్చగలిగేలా పాలసీ కవరేజ్ ఉండాలి. సాధారణంగా చూస్తే.. మీ పాలసీ కవరేజ్ అనేది వార్షిక ఆదాయానికి 10 రెట్లు ఉండాలి. అలాగే ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఖర్చు పెట్టేది రేపు అంటే భవిష్యత్లో సరిపోకపోవచ్చు. అందువల్ల ద్రవ్యోల్బణం రేటును కూడా గుర్తుపెట్టుకోవాలి..

కొన్ని బ్యాంకులు కూడా ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి.అందులో HDFC Life కూడా ఇలాంటి కంపెనీల్లో ఒకటని చెప్పుకోవచ్చు. కస్టమర్ల అవసరాలను బట్టి, వారికి అనువైన పాలసీలను రూపొందిస్తుంది.ఈ పాలసీలో మూడు ఆప్షన్లు ఉంటాయి. ఇవి Life & Critical Illness Rebalance, Life Protect & Income Plus. అలాగే అదనంగా మరో ఆప్షన్ కూడా ఉంది. రెగ్యులర్ పే నుంచి లిమిటెడ్ పేకు ప్రీమియం పేమెంట్ టర్మ్‌ను తగ్గించుకోవచ్చు.దీని గురించి పూర్తీ విషయాలను బ్రోచర్ ద్వారా తెలుసుకోవచ్చు..

పాలసీ టర్మ్‌లో పాలసీదారుడు మరణిస్తే బీమా లభిస్తుంది. అంటే పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. నామినీకి పాలసీ డబ్బులు లభిస్తాయి..అలాగే..పాలసీదారుడికి 60 ఏళ్లు వచ్చిన దగ్గరి నుంచి ఆదాయం లభిస్తుంది. దీని వల్ల 60 ఏళ్లు వచ్చిన తర్వాత అదనపు ఆదాయం లభిస్తుంది.పాలసీదారుడు మెచ్యూరిటీ తర్వాత జీవించి ఉంటే అప్పుడు చెల్లించిన ప్రీమియం మొత్తం అంతటినీ వెనక్కి చెల్లిస్తారు. అలాగే ADB ఆప్షన్ కింద ప్రమాదవశాత్తు మరణిస్తే అదనపు బీమా ప్రయోజనం ఉంటుంది. ఈ పాలసీ 98.01 శాతం క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో కలిగి ఉంది. ఇంకా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news