ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌ హ్యాక్‌ అవుతుందని భయమా?

-

ఇప్పటికే చాలా మంది ఇన్‌స్ట్రాగామ్‌ ( Instagram ) ఖాతాలు హ్యాకింగ్‌ అయిన సంగతి తెలిసిందే! అయితే దీన్ని ఏ విధంగా కట్టడి చేయాలో తెలుసుకుందాం. ఫోటో వీడియో షేరింగ్‌ యాప్‌ అయిన ఇన్‌స్టాను ఎక్కువగా వినియోగిస్తుంటారు. కానీ, ఇటీవలి కాలంలో కొన్ని ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్లు హ్యాకర్ల బారిన పడ్డాయి. దీంతో చాలా మంది ఆందోళన చెందారు.

 

ఇన్‌స్ట్రాగామ్‌ | Instagram
ఇన్‌స్ట్రాగామ్‌ | Instagram
  • ముందుగా మీ ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాలో టూ ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. దీంతో లాగిన్‌ అయినపుడు మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దీంతో పాస్‌వర్డ్‌ లీకైనా.. ఓటీపీ ఉండదు కాబట్టి వేరే వ్యక్తులు మీ అకౌంట్‌ యాక్సెస్‌ చేసే అవకాశం లేదు.
  • లాగిన్‌ రిక్వెస్ట్‌ ఎనేబుల్‌ చేసుకుంటే.. మీ ఫోన్‌లోని యాప్‌లో తప్ప ఎక్కడ లాగిన్‌ కావాలన్నా మీరు రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేయాల్సిందే. దీంతో అకౌంట్‌ సేఫ్‌గా ఉంటుంది.
  • కొత్తగా తీసుకొచ్చిన సెక్యూరిటీ చెకప్‌ ఆప్షన్‌ను హ్యాక్‌ అయిందని అనుమానం ఉంటే వెంటనే వాడాలి. సెక్యూరిటీ చెకప్‌లో.. ఎన్నిసార్లు, ఏ డివైజ్‌ల్లో లాగిన్‌ అయ్యారో అన్న సమాచారం, ప్రొఫైల్‌ డిటైల్స్‌ వంటి సదుపాయాలు ఉంటాయి. లాగిన్‌ యాక్టివిటీని చూస్తే మీ అకౌంట్‌ ఎవరు వాడుతున్నారో పట్టేయవచ్చు.
  • కొన్నిసార్లు హ్యాకర్లు.. ఇన్‌స్ట్రాగామ్‌ సంస్థ నుంచి అంటూ మెసేజ్‌ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో అకౌంట్‌ సమాచారం, పాస్‌వర్డ్‌ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇన్‌స్ట్రాగామ్‌ ఎప్పటికీ డైరెక్ట్‌ మెసేజ్‌ చేయదని గుర్తుంచుకోవాలి.
  • ఒకవేళ మీ ఇన్‌స్టా అకౌంట్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌ పాతవి అయితే వెంటనే ప్రస్తుతం వాడుతున్న నంబర్, ఈమెయిల్‌ ఐడీని అప్‌డేట్‌ చేసుకోవాలి.
  • ఇన్‌స్ట్రాగామ్‌ నుంచి వచ్చే మెయిల్స్‌ను కూడా అప్పుడప్పుడు తప్పకుండా చెక్‌ చేసుకోవాలి. ఈ మెయిల్స్‌ ఫ్రమ్‌ ఇన్‌స్ట్రాగామ్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే మెయిల్స్‌ పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news