ఇన్‌స్టాగ్రామ్‌ నయా ఫీచర్‌తో.. మార్కెటింగ్‌ ఈజీ!

ఇన్‌ స్టాగ్రామ్‌లో నయా ఫీచర్‌. అదే డ్రాప్స్‌ ఆప్షన్‌దీంతో కొత్తగా బిజినెస్‌ మొదలు పెట్టేవారు సులభంగా తమ ప్రాడక్ట్స్‌ను మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. ఇన్‌ స్ట్రాగామ్‌లో షాపింగ్‌ చేసేవారికి అదిరిపోయే ఫీచర్‌ ఒకటి త్వరలో రాబోతోంది. ‘డ్రాప్స్‌’ పేరుతో లాంచ్‌ కానుంది.


ఈ సరికొత్త ఫీచర్‌ ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను కొంతమంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. డ్రాప్స్‌ అంటే ఆ పదం ఎక్కడో విన్నట్లే ఉంది కదా. ఆన్‌ లైన్‌ షాపింగ్‌ చేసేవారికి ఈ పదం బాగా ఇష్టం. కొత్తగా లాంచ్‌ చేసే ఉత్పత్తుల విషయంలో వినియోగదారుల్లో క్రేజ్‌ పెరగాలని డ్రాప్స్‌ పేరుతో లాంచ్‌ చేస్తూ ఉంటారు. అంటే తక్కువ సంఖ్యలో ఉత్పత్తులు తీసుకొచ్చి… డిమాండ్‌ పెంచుతారు. అలాంటి ఉత్పత్తులను ఇన్‌ స్ట్రాగామ్‌ నుంచే కొనేలా షాప్‌ ట్యాబ్‌లో డ్రాప్స్‌ను తీసుకొస్తారు. ఈ ఫీచర్‌ను ప్రస్తుతానికి యూఎస్‌లో మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ వినియోగాదారులకు ఈ ఫీచర్‌ను అక్కడ తీసుకొచ్చారు. ప్రస్తుతం చాలా ఉత్పత్తులకు ఇన్‌ స్ట్రాగామ్‌ పేజీలు ఉంటాయి. వాటికి ఇటీవలే షాపింగ్‌ ట్యాబ్‌ను యాడ్‌ చేశారు. అందులోనే డ్రాప్స్‌ ఫీచర్‌ ఉంటుంది. డ్రాప్స్‌ ఫీచర్‌లో ఆయా సంస్థల కొత్త ఉత్పత్తులు, రాబోయే ఉత్పత్తుల సమాచారం అందుబాటులో ఉంటుంది. అంతేకాదు కొన్ని ఉత్పత్తులను నేరుగా ఇన్‌ స్ట్రామ్‌లోనే కొనేయొచ్చు.

ప్రస్తుతానికి ఇన్‌స్ట్రాగామ్‌ ఈ ఫీచర్‌ను ఉచితంగానే అందిస్తోంది. అయితే త్వరలో ఇలా జరిగిన షాపింగ్‌కు సంబంధించి సంస్థల నుంచి కానీ, వినియోగదారుల నుంచి కానీ డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కొవిడ్‌ కారణంగా నష్టపోయిన వ్యాపారుల కోసం ఇన్‌ స్ట్రాగామ్‌ గతేడాది విక్రయ ధరల చార్జీలను తొలగించింది.