మీరు ప్రతీ నెల డబ్బులని పొందాలని అనుకుంటున్నారా…? అయితే మీకు ఒక మంచి ఆప్షన్ ఒకటి వుంది. దీనితో మీకు ప్రతీ నెల కూడా మంచిగా డబ్బులు వస్తాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…
దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. అయితే ఈ స్కీమ్స్ లో పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. వీటితో మంచి లాభాలు పొందవచ్చు.
ఇలాంటి స్కీమ్స్‌లో జీవన్ అక్షయ పాలసీ కూడా ఒకటి వుంది. దీనిని తీసుకుంటే ప్రతీ నెల డబ్బులు వస్తాయి. ఎవరు ఈ పాలసీ తీసుకోవచ్చు అనేది చూస్తే… 30 నుంచి 85 ఏళ్లలోపు వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఏడాదికి కనీసం రూ.12 వేలు వస్తాయి.
మీరు మినిమమ్ రూ.లక్ష మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి ఏమి లేదు. అదే విధంగా మీరు పాలసీ తీసుకున్న మూడు నెలల తర్వాత మీకు లోన్ అవకాశం వుంది. అప్పుడు తీసుకోవచ్చు. ఒకేసారి రూ.10 లక్షలు కనుక తీసుకుంటే… ఈ పాలసీ తీసుకోవడం వల్ల నెలకు రూ.6,500 పొందొచ్చు.