తెలంగాణకి అలర్ట్.. మరో రెండు రోజులపాటు వర్షాలు !

తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక చల్లని వార్త చెప్పింది తెలంగాణ వాతావరణ శాఖ. ఇప్పటికే రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు వారం నుంచి తెలంగాణలో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలు ఊరట నిస్తున్నాయి. అయితే ఈరోజు రేపు కూడా తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉత్తర కర్ణా‌టక నుంచి కేరళ మీదుగా కోమ‌రిన్‌ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఉరు‌ములు, మెరు‌పులు, ఈదు‌రు‌గా‌లు‌లతో తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 48 గంట‌లలో ద‌క్షిణ, ఉత్తర, తూర్పు, మధ్య జిల్లా‌ల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలి‌క‌పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.