పీఎం కిసాన్ స్కీమ్‌లో ఇప్పుడైనా చేరండి.. ప్రభుత్వం ఇచ్చే రూ.6,000 పొందండి..!

-

మోదీ కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. రైతన్నలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రత్యేకమైన స్కీమ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని పేరు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ స్కీంలో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వం అందించే డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్‌లో జమవుతాయి. రైతులకు మోదీ సర్కార్ పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ. 6,000 అందిస్తోంది. ప్రతి సంవత్సరం మూడు విడతల్లో ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి. అయితే ఇంకా ఈ పధకంలో చేరని వారు చాలా మంది ఉన్నారు.

ఇప్పటికే అనేక మంది రైతులు కిసాన్ స్కీమ్‌లో చేరారు. మోదీ ప్రభుత్వం అందించే రూ.6,000 పొందుతున్నారు. ఈ రూ.6 వేల రూపాయలు ఒకేసారి కాకుండా, మూడు విడతల్లో అంటే రూ.2,000 చొప్పున మూడు సార్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి. పీఎం కిసాన్ స్కీమ్‌లో ఇంకా చేరలేని రైతులు ఇప్పుడైనా చేరండి. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుండి కదలకుండానే, ఆన్లైన్ లో స్కీమ్‌ లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం పీఎం కిసాన్ వెబ్‌ సైట్ ‌కు వెళ్లాలి. https://pmkisan.gov.in/ దీని ద్వారా వెబ్ ‌సైట్ ‌కు వెళ్లొచ్చు.

ఈ వెబ్‌ సైట్‌ లో కుడి వైపున ఫార్మర్స్ కార్నర్ అని ఆప్షన్ ఉంటుంది. మీరు స్కీమ్‌ లో చేరాలంటే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ పై క్లిక్ చేస్తే, కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే, తర్వాత మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పూర్తి వివరాలు, మీ బ్యాంక్ ఖాతా వివరాలు, మీ పొలం వివరాలు వంటి వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత సబ్‌మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తరువాత మీకు ఒక రెఫరెన్స్ నెంబర్, రిజిస్టర్డ్ నెంబర్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు స్కీమ్‌లో చేరడం పూర్తియిందని దాని అర్థం. ఇక మీకు కూడా పీఎం కిసాన్ స్కీం డబ్బులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news