LIC ఎన్నో రకాల పాలసీలని అందిస్తోంది. అయితే మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండ మీరు దీని కోసం తెలుసుకోవాలి. ఇక పాలసీ వివరాలని చూస్తే… ఈ ఎల్ఐసీ కన్యాదాన్ పేరు తో పాలసీ లేదు. కానీ ఈ ప్లాన్ ఈ పేరు తో బాగా పాపులర్ అయి పోయింది. ఈ పాలసీ వలన నెలకు రూ.121 చొప్పున పొదుపు చేస్తే అమ్మాయి పెళ్లి లేదా ఉన్నత చదువుల కోసం రూ.27 లక్షల రిటర్న్స్ పొందవచ్చు.
జీవన్ లక్ష్య పాలసీనే కన్యాదాన్ పాలసీగా ప్రచారం చేస్తుంటారు గమనించండి. ఇక ఈ పాలసీ వలన మనకి వచ్చే బెనిఫిట్స్ ఏమిటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఎల్ఐసీ జీవన్ లక్ష్య నాన్ లింక్డ్, పార్టిసి పేటింగ్, ఇండివిజ్యువల్ ప్లాన్ ఇది. ఈ పాలసీ కోసం కనీసం రూ.1,00,000 బీమా ఎంచుకోవాలి. గరిష్టంగా ఎంత వరకైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
వయస్సు అయితే తప్పకుండా 18 ఏళ్లు దాటినా వాళ్ళ నుండి 50 ఏళ్ల వయస్సు ఉన్న వారు వరకు అర్హులే. ఈ పాలసీ గడువు 13 ఏళ్ల నుంచి 25 ఏళ్లు ఉంటుంది. అలానే మెచ్యూరిటీ సమయం లో సమ్ అష్యూర్డ్‌తో పాటు బోనస్ కూడా వస్తుంది. ఇక ఎంత పొదుపు చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి అనే విషయానికి వస్తే…. 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి కనుక రూ.1,00,000 సమ్ అష్యూర్డ్ తో 25 ఏళ్లకు పాలసీ తీసుకుంటే 22 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఇది ఇలా ఉంటే మొదటి ఏడాది ట్యాక్స్ తో కలిపి రూ.4677 చెల్లించాలి. అలానే రెండో ఏడాది నుంచి 21 ఏళ్లు రూ.4577 చొప్పున చెల్లించాలి. 22 ఏళ్లకు చెల్లించే ప్రీమియం రూ.1,00,794 అవుతుంది. అయితే ఆ మెచ్యూరిటీ సమయం లో రూ.1,00,000 సమ్ అష్యూర్డ్+రూ.1,22,500 బోనస్+రూ.33,000 ఫైనల్ అడిషనల్ బోనస్ వస్తుంది. అంటే మొత్తం రూ.2,55,500 వస్తుంది. ఒకవేళ రూ.10,00,000 సమ్ అష్యూర్డ్‌తో ఇదే కాలానికి పాలసీ తీసుకుంటే… మొత్తంగా రూ.26,75,000 వరకు పొందొచ్చు
ఇలా మీ వయస్సు, మీరు పెట్టె డబ్బులు బట్టి ఎంత పొందొచ్చు అనేది తెలుసుకోండి. ఈ పాపులర్ ప్లాన్ వలన మధ్య తరగతి కుటుంబాలు అమ్మాయి పెళ్లికి, ఉన్నత చదువులకు డబ్బులు పొదుపు చేస్తే చాల మంచిది. LIC ఈ లక్ష్యం తోనే ఈ ప్లాన్ ని తీసుకొచ్చింది.